వంకాయ నువ్వుల కూర

ABN , First Publish Date - 2015-12-31T15:22:51+05:30 IST

కావాల్సిన పదార్థాలు: వంకాయలు - అరకిలో, నువ్వులు - 100గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూను, కారం - నాలుగు టీ స్పూన్లు, ఉప్పు -

వంకాయ నువ్వుల కూర

కావాల్సిన పదార్థాలు: వంకాయలు - అరకిలో, నువ్వులు - 100గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూను, కారం - నాలుగు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, ఎండుమిరపకాయలు - నాలుగు, ధనియాలు - రెండు టీ స్పూన్లు, నూనె- తగినంత.
తయారుచేయు విధానం: స్టౌ మీద కడాయిపెట్టి అందులో నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి దోరగ వేయించుకుని చల్లారిన తరువాత వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని కోసి అందులో ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. స్టౌ మీద మరో గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముద్ద, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా వేయించాలి. అలా వేగుతున్నప్పుడే కారం ఉప్పు కూడా వేసి బాగా కలిపి వంకాల్ని కూడా వేసి కాసేపు మూతపెట్టాలి. బాగా మగ్గాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. వంకాయ నువ్వుల కూర పండగపూట అన్నంతో కలుపుకుని తింటే అదుర్స్‌.

Updated Date - 2015-12-31T15:22:51+05:30 IST