స్టిర్‌ ఫ్రై వెజ్‌ కట్స్‌

ABN , First Publish Date - 2015-12-19T16:07:57+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు, సిమ్లామిర్చి(వివిధ రంగుల్లో) ఒక్కో రంగుకు ఒక మిర్చి, క్యాబేజీ పావు కేజీ, పన్నీర్‌ 100గ్రాములు, వివిధ రకాల కూరగాయలు 250 గ్రాములు, అల్లం వెల్లుల్లి మిశ్రమం

స్టిర్‌ ఫ్రై వెజ్‌ కట్స్‌

కావలసిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు, సిమ్లామిర్చి(వివిధ రంగుల్లో) ఒక్కో రంగుకు ఒక మిర్చి, క్యాబేజీ పావు కేజీ, పన్నీర్‌ 100గ్రాములు, వివిధ రకాల కూరగాయలు 250 గ్రాములు, అల్లం వెల్లుల్లి మిశ్రమం 1 టేబుల్‌ స్పూన్‌  నిమ్మకాయ సగం ముక్క, మిరియాల పొడి 1/2 టేబుల్‌ స్పూన్‌, నూనె ఒకటిన్నర చెంచా

తయారుచేయు విధానం: ముందుగా కూరగాయలను చిన్నగా కట్‌ చేసుకోవాలి. పాలకూర, క్యాబేజీని కూడా చిన్నగా కోసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె తీసుకుని బాగా వేడి కాకముందే మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. అనంతరం చిన్నగా కట్‌ చేసుకున్న కూరగాయల ముక్కలను, క్యాబేజీని, పాలకూరను వేయాలి. వీటిని కలుపుతూ చిన్న మంటపైన వేయించాలి. పన్నీర్‌ ముక్కలను, సిమ్లా మిర్చిని కూడా వేసుకోవాలి. రంగుల రంగుల సిమ్లా మిర్చిని వేయడం వల్ల వంటకం ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు రుచికరంగా ఉంటుంది. పదార్థాలన్నీ వేసుకున్నాక మూడు నుంచి మూడున్నర నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చివరగా నిమ్మరసం పిండుకుంటే వేడి వేడి స్టిర్‌ ఫ్రై వెజ్‌ కట్స్‌ రెడీ.

Updated Date - 2015-12-19T16:07:57+05:30 IST