Abn logo

పనీర్‌ టమోటా కర్రీ

కావలసిన పదార్థాలు: పనీర్‌ ముక్కలు: పావు కిలో, అల్లం: చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు: నాలుగు లేక ఐదు, టమోటా గుజ్జు: పావుకప్పు, ధనియాల పొడి: టేబుల్‌ స్పూను, గరం మసాలా: టేబుల్‌ స్పూను, జీలకర్ర పొడి: టేబుల్‌ స్పూను, జీడిపప్పు: పది లేక పన్నెండు(నీటిలో కొద్దిసేపు నానపెట్టుకోవాలి), ఉప్పు: రుచికి సరిపడ, నెయ్యి: రెండు టేబుల్‌ స్పూన్లు, నూనె: తగినంత.
తయారీ విధానం: ముందుగా అల్లం పచ్చిమిర్చి ముద్దగా చేసుకోవాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలనుకొద్దిగా వేయించుకుని మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే నానపెట్టుకున్న జీడిపప్పులను కూడా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు బాండీ లేదా మందపాటి గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసి పనీర్‌ ముక్కల్ని వేయించి అవి చల్లారిన తరువాత కొద్దిపాటి నీటిలో నాలుగు లేక ఐదు నిమిషాల పాటువుంచి నీరంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో నూనె వేసి కాగిన తరువాత ఉల్లిపాయ ముద్ద వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తరువాత పచ్చిమిరపకాయల ముద్ద, టమోటా గుజ్జు కూడా వేసి మరికొద్దిసేపు వేయించాలి. ఇవన్నీ ఉడుకుతున్న సమయంలో ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, జీడిపప్పు ముద్ద వేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసుకోవాలి. ఇవన్నీ ఉడుకుతున్న సమయంలో పనీర్‌ ముక్కలను కూడా వేసుకోవాలి. కూర మరీ గట్టిగాకాకుండా కొద్దిగా పలచగా వుండగానే దింపేసుకోవాలి.


బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల బారులు

దీపాలు వెలిగించాలంటూ డప్పు చాటింపు

ఘన్‌పూర్‌లో బియ్యం పంపిణీ ప్రారంభం

కూలీలకు సరుకుల పంపిణీ

పకడ్బందీగా లాక్‌డౌన్‌

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

కరోనా కలకలం

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

వలస కూలీలకు ఆశ్రయం

శానిటైజర్ల అందజేత
Advertisement
d_article_rhs_ad_1

నవ్య