గోరుచిక్కుడు వెల్లుల్లి

ABN , First Publish Date - 2015-09-03T17:11:28+05:30 IST

కావలసిన పదార్థాలు: గోరుచిక్కుడు తరుగు - 2 కప్పులు, పుట్నాలు - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 4

గోరుచిక్కుడు వెల్లుల్లి

కావలసిన పదార్థాలు: గోరుచిక్కుడు తరుగు - 2 కప్పులు, పుట్నాలు - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 4, ఎండుకొబ్బరిపొడి - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి - అర పాయ రేకలు, నూనె - 1 టేబుల్‌ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, జీరా + ఆవాలు + మినప్పప్పు - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: గోరుచిక్కుడు తరుగు ఉడికించి నీరు వార్చి పక్కనుంచుకోవాలి. ఎండుమిర్చి వేగించి చల్లార్చి ఉప్పు, పుట్నాలు, ఎండుకొబ్బరి, వెల్లుల్లి రేకలు కలిపి పొడి కొట్టుకోవాలి. కడాయిలో నూనెవేసి ఆవాలు, జీరా, మినప్పప్పు, కరివేపాకు వేగించి వెల్లుల్లి పొడి కలిపి, నిమిషం తర్వాత గోరుచిక్కుడు తరుగు వేసి బాగా కలిపి దించేయాలి. ఈ కూర వెల్లుల్లి ఫ్లేవర్‌తో ఉండి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-03T17:11:28+05:30 IST