Abn logo

చిట్టి ఆలూ కర్రీ

కావలసినవి: జీలకర్ర, దనియాలు, నల్ల ఆవాలు, పసుపు ఒక్కొక్క టీస్పూను, వెన్న 100 గ్రా, వెల్లుల్లి రెండు రెబ్బలు, ఎండుమిర్చి రెండు, చిట్టి బంగాళా దుంపలు 750 గ్రా, ఉప్పు తగినంత.
ఎలా చేసుకోవాలి: దీనికి ఓవెన్‌ కావాలి. జీలకర్ర దనియాలు అప్పటికప్పుడు నూరండి. పాన్‌ పొయ్యి మీద పెట్టి వెన్న వేశాక ఆవాలు, వెల్లుల్లి, ఎండు మిర్చి వేసి వేగించండి. తర్వాత జీలకర్ర, దనియాల పొడి, ఉప్పు వేసి వేగాక ముందే వేడెక్కి ఉన్న ఓవెన్‌లో ఆ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు ఉంచండి. తర్వాత దాన్ని బయటికి తీసి - అప్పటికి మంచి వాసన వస్తుంటుంది - ఆలుగడ్డలు కలపండి. వెన్న, మసాలా దానికి బాగా పట్టాక మళ్ళీ ఓవెన్‌లో పెట్టి 20-25 నిమిషాల సేపు ఉంచండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికాక బయటికి తీసి వేడిగా వడ్డించండి.

పలువురు తహసీల్దార్ల బదిలీవ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధికి కృషి చేయాలికరోనా నియంత్రణకు నిరంతర కృషిఎడతెరపిలేని వర్షంక్వారంటైన్‌ కేంద్రాల్లో బాధితుల బెంబేలువృథాగా సాగునీరు హమాలీల నిరవధిక సమ్మె డంపింగ్‌యార్డు పనుల్లో అలసత్వంపై కలెక్టర్‌ ఆగ్రహం ఇంకెన్నాళ్లీ కష్టాలుసర్వం సిద్ధం
Advertisement
d_article_rhs_ad_1
Advertisement