కంద అరటి ఆవియల్‌

ABN , First Publish Date - 2015-09-03T17:46:58+05:30 IST

కావలసిన పదార్థాలు: కంద ముక్కలు - 1 కప్పు, అరటికాయలు - 2, క్యారెట్‌ - 2, మునక్కాడలు

కంద అరటి ఆవియల్‌

కావలసిన పదార్థాలు: కంద ముక్కలు - 1 కప్పు, అరటికాయలు - 2, క్యారెట్‌ - 2, మునక్కాడలు - 2, బంగాళదుంప, పొట్ల, బూడిద గుమ్మడి ముక్కలు - అరకప్పు చొప్పున, బీన్స్‌ - 3, పచ్చిమిర్చి - 4, పచ్చిమామిడికాయ - అంగుళం ముక్క, పసుపు - 2 టీ స్పూన్లు, నూనె - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
పేస్టుకోసం: కొబ్బరి తురుము - 2 కప్పులు, జీలకర్ర - అర టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, చిన్న ఉల్లిపాయలు - 8, పెరుగు - పావు కప్పు.
తయారుచేసే విధానం: అన్ని ముక్కల్నీ కలిపి అంగుళం మేర నీళ్లు పోసి ఉడికించాలి. సగం ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు కలపాలి. ఈలోపు కొబ్బరి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు, మామిడిముక్క, పెరుగు కలిపి పేస్టు చేసుకోవాలి. ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత రుబ్బిన పేస్టు కలిపి 2 నిమిషాలు ఉంచి దించేముందు నూనె కలపాలి. అన్నం, పరాటాలతో బాగుంటుంది.

Updated Date - 2015-09-03T17:46:58+05:30 IST