కందగడ్డ గారెలు

ABN , First Publish Date - 2017-10-14T22:35:19+05:30 IST

(చెక్కు తీసి తరిగిన) కంద ముక్కలు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - 3, అల్లం - అంగుళం...

కందగడ్డ గారెలు

కావలసిన పదార్థాలు
 
(చెక్కు తీసి తరిగిన) కంద ముక్కలు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - 3, అల్లం - అంగుళం
ముక్క, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం
 
కంద ముక్కల్లో పచ్చిమిర్చి, అల్లం వేసి రుబ్బి, తగినంత ఉప్పు కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, చేతిపై గారెల్లా ఒత్తుతూ నూనెలో మాడిపోకుండా దోరగా వేగించాలి. వేడిగా టమోటా కచప్‌తో లేదా పప్పుచారన్నంతో నంజుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2017-10-14T22:35:19+05:30 IST