ఎగ్ ఫ్లోరెంటైన్ (ఫ్రాన్స్)
v id="pastingspan1">
కావలసిన పదార్థాలుగుడ్లు - 4, పాలకూర - 150 గ్రా., బటర్ - ఒక టేబుల్ స్పూను, వెల్లుల్లి తరుగు - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం
పాన్‌లో బటర్ వేడి చేసి వెల్లుల్లి తరుగు వేగించాలి. ఆ తర్వాత శుభ్రం చేసి తరిగిన పాలకూర కూడా వేయాలి. మరో పాత్రలో కప్పు నీరు మరిగించి గుడ్ల సొన వేయాలి (కలప కూడదు). సొన గట్టిపడ్డాక తీసి వేగిన పాలకూర పైన ఉంచి, పైన ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. దీన్ని బ్రెడ్‌తో సాండ్‌విచ్‌లా తింటే బాగుంటుంది.