ఎగ్ షక్షుక (ఇజ్రాయిల్)
v id="pastingspan1">
కావలసిన పదార్థాలుగుడ్లు- 4, ఉల్లి తరుగు- అరకప్పు, వెల్లుల్లి - ఒకటి, క్యాప్సికం- ఒకటి, టమోటా తరుగు- 4 కప్పులు, కారం, జీరా పొడి- ఒక టీ స్పూను చొప్పున, పంచదార- చిటికెడు, ఉప్పు, మిరియాల పొడి- రుచికి తగినంత, ఆలివ్ నూనె- ఒక టీ స్పూను, పనీర్ తురుము- 10 గ్రా., పార్సిలీ తరుగు- అర టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం
కడాయిలో ఆలివ్ నూనె వేసి ఉల్లి, వెలుల్లి, క్యాప్సికం తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. టమోటా తరుగు కూడా వేసి పది నిమిషాల పాటు మగ్గించి కారం, జీరా పొడి, ఉప్పు, పంచదార వేయాలి. ఇప్పుడు గుడ్లు పగలగొట్టి (విడివిడిగా) వేసి, పైన పనీర్ తురుము చల్లి మూత పెట్టి ఏడు నిమిషాల తర్వాత దించేసి పార్సిలీ తరుగుతో అలంకరించాలి.