మష్రూమ్‌ ఆమ్లెట్‌

ABN , First Publish Date - 2015-09-01T17:48:22+05:30 IST

కావలసిన పదార్థాలు: మష్రూమ్స్‌ - 100 గ్రా., గుడ్లు - 3, మిరియాల పొడి - అర టీ స్పూను, పసుపు

మష్రూమ్‌ ఆమ్లెట్‌

కావలసిన పదార్థాలు: మష్రూమ్స్‌ - 100 గ్రా., గుడ్లు - 3, మిరియాల పొడి - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర - 1 కట్ట, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: మష్రూమ్స్‌ శుభ్రం చేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి కొద్ది నీటిలో 5 నిమిషాలు ఉడికించి వడకట్టాలి. ఒక లోతైన పాత్రలో గుడ్లు గిలకొట్టి ఉల్లి, మష్రూమ్స్‌, పచ్చిమిర్చి తరుగులతో పాటు పసుపు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపి 5 నిమిషాలు పక్కనుంచాలి. ఇప్పుడు పెనంపై నూనె రాసి ఆమ్లెట్‌ వేసి, కొత్తిమీర తరుగు చల్లి, రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. ఈ ఆమ్లెట్‌ టిఫిన్‌గా తిన్నా, అన్నంతో నంజుకున్నా బాగుంటుంది.

Updated Date - 2015-09-01T17:48:22+05:30 IST