చేపలు మామిడికాయ కూర

ABN , First Publish Date - 2015-08-29T22:20:49+05:30 IST

కావలసిన పదార్థాలు: సొరచేప (చర్మంతో) - అరకేజి, పచ్చిమామిడి ముక్కలు (తొక్కతో పాటు) - ముప్పావు కప్పు

చేపలు మామిడికాయ కూర

కావాల్సిన పదార్థాలు
 
సొరచేప (చర్మంతో) - అరకేజి, పచ్చిమామిడి ముక్కలు (తొక్కతో పాటు) - ముప్పావు కప్పు, ఎండుకొబ్బరి తురుము - 1 కప్పు, ఉల్లిపాయ తరుగు - పావు కప్పు, కరివేపాకు - 8 రెబ్బలు, దనియాలపొడి - అర టీ స్పూను, మిరియాలపొడి - పావు టీ స్పూను, పసుపు - చిటికెడు, నీరు - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారీ విధానం
 
చేపని అంగుళం ‘క్యూబ్‌’లుగా కోసి పెట్టుకోవాలి. కొబ్బరి తురుము, ఉల్లితరుగు, 4 రెబ్బల కరివేపాకు, ధనియాలపొడి, మిరియాలపొడి, పసుపును అరకప్పు నీటితో పేస్టులా గ్రైండు చేసుకోవాలి. కడాయిలో పేస్టుని వేసి మిగిలిన అరకప్పు నీరు, చేపముక్కలు వేసి ఉడికించాలి. చేప సగం ఉడికిన తర్వాత మామిడి ముక్కలు, చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి సన్నని మంటమీద ఉడికించి దించేయాలి. నూనెలేకుండా చేసుకునే ఈ చేపలకూర వేడి వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది.
 

Updated Date - 2015-08-29T22:20:49+05:30 IST