పచ్చి బొప్పాయి సలాడ్‌

కావలసిన పదార్థాలు: బొప్పాయి - సగం (గింజలు తీసిన) పచ్చిమిర్చి - 1, పంచదార - 1 టీ స్పూను, నిమ్మరసం - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు, ఆవాలు - పావు టీ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - కొద్దిగా.
తయారుచేసే విధానం: బొప్పాయి తొక్క తీసి, సన్నగా తురిమి, పంచదార, ఉప్పు, నిమ్మరసం కలిపి 5 నిమిషాలు పక్కనుంచాలి. నూనెలో ఆవాలు, సన్నగా, పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి (ఇష్టమైతే చిటికెడు ఇంగువ)తో తాలింపు పెట్టి తురుములో కలిపి, కొత్తిమీర చల్లాలి. ఈ సలాడ్‌ కరకరలాడుతూ కమ్మగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మంచిది.

కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలిలోకేశ్వరంలో నగదు, బంగారం చోరీపకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలిసుందరీకరణ పనులు పూర్తయితే నిర్మల్‌కు కొత్తశోభపొంచి ఉన్న బ్లాక్‌ఫంగస్‌ ముప్పుపకడ్బందీగా లాక్‌డౌన్‌పట్టణంలో అధికారుల తనిఖీలుదరఖాస్తులు చేసుకోవాలిపార్టీలకతీతంగా కలిసి పని చేయాలిలాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి : మంత్రి
Advertisement
Advertisement