చిల్లీ ప్రాన్స్

ABN , First Publish Date - 2017-11-05T20:32:51+05:30 IST

టైగర్‌ రొయ్యలు - 12, ఉల్లి తరుగు - ఒక కప్పు, ఎండుమిర్చి - 4, పచ్చిమిర్చి - 2, వెల్లుల్లి - 3 రెబ్బలు...

చిల్లీ ప్రాన్స్

కావలసిన పదార్థాలు
టైగర్‌ రొయ్యలు - 12, ఉల్లి తరుగు - ఒక కప్పు, ఎండుమిర్చి - 4, పచ్చిమిర్చి - 2, వెల్లుల్లి - 3 రెబ్బలు, అల్లం - రెండు అంగుళాల ముక్క, వెనిగర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, టమోటా పేస్టు - ఒక టేబుల్‌ స్పూను, టమోటా ప్యూరీ - 400 మి.లీ., సోయా సాస్‌ - అర టీ స్పూను, పంచదార - 4 టేబుల్‌ స్పూన్లు, కార్న్‌ ఫ్లోర్‌ - 2 టీ స్పూన్లు, గుడ్లు - 2, ఉప్పు - రుచికి సరిపడా.
 
తయారుచేసే విధానం
ఎండు + పచ్చి మిర్చీ, ఉల్లి, అల్లం, వెల్లుల్లి - అన్నీ కలిపి ముద్దగా నూరుకోవాలి. అర కప్పు నీటిలో కార్న్‌ఫ్లోర్‌ కరిగించాలి. మరో పాత్రలో టమోటా పేస్టు, టమోటా ప్యూరీ, సోయా సాస్‌, వెనిగర్‌ కలపాలి. బాణలిలో నూనె వేసి ముందుగా ఉల్లి మిశ్రమం, ఆ తర్వాత టమోటా మిశ్రమం, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి వేసి పచ్చివాసన పోయేవరకు వేగించి రొయ్యలు వేయాలి. రొయ్యలు మెత్తబడ్డాక కరిగిన కార్న్‌ఫ్లోర్‌ కలపాలి. ఇప్పుడు గిలకొట్టిన గుడ్లు కలిపి చిన్న మంటపై 10 నిమిషాలు ఉంచాలి. దించేముందు కొత్తిమీర చల్లాలి. అన్నంతో పాటుగా బ్రెడ్‌ సాండ్‌ విచ్‌గా కూడా బాగుంటుంది.

Updated Date - 2017-11-05T20:32:51+05:30 IST