దహీ పోహా

ABN , First Publish Date - 2018-11-24T18:09:08+05:30 IST

అటుకులు,పెరుగు- ఒక్కొక్కటీ రెండేసి కప్పులు, ఉప్పు-రుచికి సరిపడా, ఇంగువ-సరిపడా...

దహీ పోహా

కావలసినవి
 
అటుకులు,పెరుగు- ఒక్కొక్కటీ రెండేసి కప్పులు, ఉప్పు-రుచికి సరిపడా, ఇంగువ-సరిపడా, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, -ఒకొక్కటీ ఒక్కో టీస్పూను, పచ్చిమిర్చి-మూడు, అల్లం-కొద్దిగా (సన్నటి ముక్కలుగా చేసి), కరివేపాకు, కొత్తిమీర-తగినంత.
 
తయారీవిధానం
 
పెరుగును చిక్కగా చిలకాలి. అల్లం, పచ్చిమిరపకాయలను చిన్నముక్కలుగా తరగాలి.
కడాయిలో నెయ్యి వేడి చేసి సెనగపప్పు, మినపప్పు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేగించాలి. అందులోనే ఆవాలు, జీలకర్రలను కూడా వేసి వేగనివ్వాలి. తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు కూడా అందులో వేసి రెండు నిమిషాలు వేగించాలి. అటుకులను కడిగి ఐదు నిమిషాలు నీళ్లల్లో నాననివ్వాలి.
నానిన అటుకుల్లో నీరు లేకుండా గట్టిగా పిండి ఒక బౌల్‌లో వేయాలి. ఆ అటుకుల్లో పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి. తర్వాత వేగించిన తాళింపును బౌల్‌లోని పెరుగు అటుకుల్లో వేసి కలిపితే దహీ పోహా రెడీ. దీన్ని కార్తీకమాసంలో అల్పాహారంగా తీసుకోవచ్చు.

Updated Date - 2018-11-24T18:09:08+05:30 IST