Abn logo

రెడ్‌గ్రామ్‌-పొటాటో సలాడ్‌

కావలసిన పదార్థాలు : కందులు-ఒక కప్పు, బంగాళదుంప(పెద్దది)-1, టమాట(చిన్నది)-1, పచ్చిమిర్చి-1, ఉల్లిపాయ(చిన్నది)-1, చాట్‌ మసాల లేదా కారం-అర టీ స్పూన్‌, కొత్తిమీర-కొద్దిగా, ఉప్పు-రుచికి సరిపడా.
తయారుచేసే విధానం :
కందులను బాగా నానబెట్టి ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. బంగాళదుంపను కూడా ఉడికించి పైన పొట్టుతీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి కందులలో వేయాలి. తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఆ ముక్కలను కూడా వీటికి జతచే సి, కొద్దిగా చాట్‌ మసాలా వేసి బాగా కలపాలి. పైన కొత్తిమీర చల్లుకుని కాస్త వేడిగా ఉన్నప్పుడే ఏదైనా పండ్ల రసం తాగుతూ తింటే భలే రుచిగా ఉంటుంది.

దాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి రోడ్డు ప్రమాదంలో సర్పంచ్‌కు తీవ్ర గాయాలునిద్రిస్తున్న యువకుడి పైనుంచి వెళ్లిన బోరుబండిప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలికొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలిఅమ్మవారి సేవలో విద్యుత్‌శాఖ ఓఎ్‌సడీనట్టేటా ముంచిన నకిలీ విత్తనాలుకల్యాణం... కమనీయంజంతువుల పెంపకానికి పరివేష్‌!ఆన్‌లైన్‌లో సైన్స్‌ ప్రాజెక్టుల ప్రదర్శన
Advertisement
Advertisement