చికెన్‌ మలాయి కబాబ్‌

ABN , First Publish Date - 2017-06-17T17:59:10+05:30 IST

కావలసిన పదార్థాలు చిన్న చికెన్‌ ముక్కలు - 14 పుల్లని పెరుగు - 1 కప్పు అల్లం పేస్ట్‌ - 1 టీస్పూను వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీస్పూను

చికెన్‌ మలాయి కబాబ్‌

కావలసిన పదార్థాలు
 
చిన్న చికెన్‌ ముక్కలు - 14
పుల్లని పెరుగు - 1 కప్పు
అల్లం పేస్ట్‌ - 1 టీస్పూను
వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీస్పూను
జాజికాయ పొడి - చిటికెడు
యాలకుల పొడి - 1 టీస్పూను
మిరియాల పొడి - అర టీస్పూను
నిమ్మరసం - 1 టే.స్పూన్లు
క్రీమ్‌ చీజ్‌ - 1 కప్పు
మోజరెల్లా చీజ్‌ - 2 టే.స్పూన్లు
కార్న్‌ఫ్లోర్‌ - 1 టే.స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
 
తయారీ విధానం
 
ఓవెన్‌ను 180 డిగ్రీలకు ప్రిహీట్‌ చేసుకుని గిన్నెలో చికెన్‌ ముక్కలు వేసి ఓవెన్‌లో ఉంచాలి. ఓవెన్‌కు బదులుగా చికెన్‌ ముక్కలకు నీరు చేర్చి పొయ్యి మీద కూడా మెత్తగా ఉడికించొచ్చు.
ఓ గిన్నెలో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, జాజి కాయ పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం, క్రీమ్‌ చీజ్‌, మోజరెల్లా చీజ్‌, కార్న్‌ఫ్లోర్‌ వేసి బాగా కలపాలి.
దీనికి చికెన్‌ ముక్కలు వేసి బాగా కలపాలి.
పుల్లని పెరుగు చేర్చి ఒక గంటపాటు చికెన్‌ నానబెట్టాలి.
తర్వాత చికెన్‌ ముక్కల్ని స్కీవర్‌కు గుచ్చి బేకింగ్‌ ట్రే మీద వరుసగా ఉంచాలి.
ఈ ముక్కల మీద మిగిలిన పెరుగు మిశ్రమం, నూనె పూయాలి.
ఈ ట్రేను ప్రీహీటెడ్‌ ఓవెన్‌లో 20 నిమిషాలపాటు బంగారు రంగులో కాలేవరకూ ఉంచి తీయాలి.
ఓవెన్‌కు బదులుగా నిప్పుల కుంపటి మీద అమర్చిన గ్రిల్‌ మీద కూడా చికెన్‌ ముక్కల్ని కాల్చుకోవచ్చు.
అన్ని వైపులా ముక్కలు కాలిన తర్వాత కొత్తిమీర చట్నీతో సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-06-17T17:59:10+05:30 IST