మామిడి పన్నా

ABN , First Publish Date - 2019-04-27T20:52:53+05:30 IST

పచ్చి మామిడికాయ - 500గ్రాములు, పంచదార - అరకప్పు, ఉప్పు - రెండు టీస్పూన్లు, ఉప్పు - రెండు టీస్పూన్లు..

మామిడి పన్నా

కావలసిన పదార్థాలు
 
పచ్చి మామిడికాయ - 500గ్రాములు, పంచదార - అరకప్పు, ఉప్పు - రెండు టీస్పూన్లు, ఉప్పు - రెండు టీస్పూన్లు, జీలకర్ర - రెండు టీస్పూన్లు, పుదీనా - ఒకకట్ట, నీళ్లు - రెండు కప్పులు.
 
తయారుచేసే విధానం
 
ముందుగా జీలకర్రను వేగించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత ఒక పాత్రలో నీళ్లు పోసి మామిడికాయలు వేసి ఉడికించుకోవాలి. నీళ్లు చల్లారిన తరువాత మామిడికాయ గుజ్జు తీసేయాలి. అందులో పంచదార, ఉప్పు. జీలకర్రపొడి, పుదీనా వేసి గ్రైండ్‌ చేసుకోవాలి.
చల్లగా కావాలనుకంటే ఐస్‌ ముక్కలు వేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-04-27T20:52:53+05:30 IST