Abn logo

ప్లమ్‌ కేక్‌

కావలసిన పదార్థాలు
 
వెన్న - 1 కప్పు, చక్కెర - ఒకటిన్నర కప్పు, గుడ్లు - 6, బాదం పలుకులు - 125 గ్రాములు, వెనిల్లా ఎసెన్స్‌ - 2 స్పూనులు, మిక్స్‌డ్‌ ఫ్రూట్స్‌ - రెండున్నర కప్పులు (ఎండుద్రాక్ష, చెర్రీలు, ఖర్జూరం, జీడిపప్పు), మైదా - 2 కప్పులు, కేక్‌ టిన్‌ - 8 అంగుళాలు.
 
తయారీవిధానం
కేక్‌ లోపల గోడలకు, అడుగున బ్రౌన్‌ పేపర్‌ పరుచుకోవాలి. మిక్స్‌డ్‌ ఫ్రూట్‌, బాదం సన్నగా తరిగి, మైదాలో కలిపి పక్కన పెట్టుకోవాలి. వెన్న, చక్కెర, గుడ్లు, వెనిల్లా ఒక గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టుకోవాలి. దీన్లో మైదా, ఫ్రూట్‌ మిక్స్చ్‌ర్‌ వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కేక్‌ టిన్‌లో నింపాలి. ప్రి హీటెడ్‌ ఓవెన్‌లో 30 నుంచి 40 నిమిషాలపాటు బేక్‌ చేసుకోవాలి. ఈ ప్లమ్‌కేక్‌లో మిక్స్‌డ్‌ ఫ్రూట్స్‌ ఉంటాయి కాబట్టి రుచికరంగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారు.

అగ్రిసెజ్‌ దిశగా అడుగులు రగడఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్యా యత్నంఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలిజూన్‌ 2న ఆవిర్భావ వేడుకలురుణాలను సకాలంలో మంజూరు చేయాలి : కలెక్టర్‌ అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement