కార్న్‌ భేల్‌

ABN , First Publish Date - 2019-06-29T20:17:07+05:30 IST

కార్న్‌ - రెండు కప్పులు, బంగాళదుంపలు - రెండు, కారపూస - పావుకప్పు, ఉల్లిపాయలు

కార్న్‌ భేల్‌

కావలసినవి
 
కార్న్‌ - రెండు కప్పులు, బంగాళదుంపలు - రెండు, కారపూస - పావుకప్పు, ఉల్లిపాయలు - రెండు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, కొత్తిమీర - ఒకకట్ట.
చట్నీ కోసం : కొత్తిమీర - ఒకకట్ట, పచ్చిమిర్చి - నాలుగు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, చింతపండు - కొద్దిగా, పంచదార - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - ఒక టీస్పూన్‌.
 
తయారీవిధానం
 
ముందుగా కార్న్‌ ఉడికించుకోవాలి. బంగాళదుంపలు ఉడికించుకొని పొట్టు తీసి, మెత్తగా చేయాలి. ఉల్లిపాయలు సన్నగా కట్‌ చేయాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పంచదార, ఉప్పు, కారం వేసి, తగినన్ని నీళ్లుపోసి మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి చట్నీ తయారుచేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో ఉడికించిన కార్న్‌ తీసుకొని ఉల్లిపాయలు, బంగాళదుంప మెష్‌, కొత్తిమీర, నిమ్మరసం, చట్నీ వేసి బాగా కలియబెట్టాలి. కారపూస, ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-06-29T20:17:07+05:30 IST