మష్రూమ్‌ 65

ABN , First Publish Date - 2015-08-30T21:18:59+05:30 IST

కావలసిన పదార్థాలు: మష్రూమ్స్‌ - 200 గ్రా., మైదా - 3 టేబుల్‌ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను,

మష్రూమ్‌ 65

కావలసిన పదార్థాలు: మష్రూమ్స్‌ - 200 గ్రా., మైదా - 3 టేబుల్‌ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను, మిరియాల పొడి - పావు టీ స్పూను.
సాస్‌ కోసం: నూనె - 1 టీ స్పూను, ఉల్లి తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను, టమోటా కెచప్‌ - 1 టీ స్పూను, చిల్లీగార్లిక్‌ సాస్‌ - 1 టీ స్పూను, చైనీస్‌ చిల్లీ సాస్‌ - 1 టీ స్పూను, సోయా సాస్‌ - అర టీ స్పూను, వెనిగర్‌ - 1 టీ స్పూను, మిరియాల పొడి - పావు టీ స్పూను, ఉల్లికాడలు - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: కప్పు నీటిలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, మిరియాల పొడి, ఉప్పు వేసి చిక్కగా కలపాలి. శుభ్రం చేసిన మష్రూమ్స్‌ను మైదా జారులో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. ఒక టీ స్పూను నూనెలో ఉల్లి, వెల్లుల్లి అర నిమిషం వేగించి టమోటా కెచప్‌, చిల్లీ గార్లిక్‌ సాస్‌, చైనీస్‌ సాస్‌, మిరియాలపొడి, ఉప్పు, వెనిగర్‌లతో పాటు కొద్ది నీరు పోయాలి. నిమిషం తర్వాత వేగించిన మష్రూమ్స్‌ కలపాలి. మష్రూమ్స్‌కు సాస్‌ బాగా పట్టిన తర్వాత సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని ఉల్లికాడల తరుగుతో అలంకరించాలి. 

Updated Date - 2015-08-30T21:18:59+05:30 IST