Abn logo

చిల్లీ బేబీకార్న్‌

కావలసిన పదార్థాలు
 
బేబీ కార్న్‌ - పావు కేజీ, (చిన్న) ఉల్లిపాయలు - 2, ఉల్లికాడ తరుగు (తెల్లవి) - 6 టేబుల్‌ స్పూన్లు,( పచ్చవి) - 4 టేబుల్‌ స్పూన్లు, అల్లం, వెల్లుల్లి తరుగు - 1 టేబుల్‌ స్పూను చొప్పున, సోయా సాస్‌, వెనిగర్‌ - 2 టీ స్పూన్ల చొప్పున, కార్న్‌ ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, బ్రౌన్‌ షుగర్‌ - అర టేబుల్‌ స్పూను, క్యాప్సికం - 1, టమోటా సాస్‌ - ఒకటిన్నర టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి పేస్టు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె -2 టేబుల్‌ స్పూన్లు, మిరియాలపొడి - చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్టు - పావు టీ స్పూను.
 
తయారుచేసే విధానం
 
బేబీకార్న్‌ను అంగుళం ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. చిటికెడు ఉప్పు, మిరియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కరిగించిన 1 టేబుల్‌ స్పూను కార్న్‌ఫ్లోర్‌లను బేబీ కార్న్‌కు పట్టించి పది నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత పాన్‌లో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసి అందులో వీటిని వేసి అన్నివైపులా వేగించి, తీసి పక్కనుంచాలి. అదే పాన్‌లో అల్లం, వెల్లుల్లి తరుగు పెద్ద మంట మీద అర నిమిషం వేగించాలి. తర్వాత ఉల్లి కాడల తరుగు, క్యాప్సికం ముక్కలు వేగించాలి. అవి వేగాక పచ్చిమిర్చి పేస్టు, టమోటా, సోయా సాస్‌లు, వెనిగర్‌, పంచదారలతో పాటు వేగించిన బేబీకార్న్‌ కలిపి పెద్దమంటపై ఒక నిమిషం వేగించి, పావుకప్పు నీరు పోయాలి. నిమిషం తర్వాత మిగతా కార్న్‌ఫ్లోర్‌ వేసి చిక్కబడ్డాక ఉల్లికాడలు (పచ్చవి) చల్లి దించేయాలి. స్నాక్స్‌గా గాని, వెజ్‌బిర్యానిలో సైడ్‌ డిష్‌గా గాని బాగుంటాయి.

మంచిర్యాల కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులునిర్మల్‌లో రెండు సింహాల సంచారం?బాధిత కుటుంబాలకు పరామర్శ ‘ఎస్సీ, ఎస్టీ చట్టాల అమలులో నిర్లక్ష్యం’ బీడీ కార్మికులకు పని దినాలు పెంచండి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్‌ చైర్మన్‌నర్సరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌కడెం అడవుల్లో పర్యటించిన జడ్పీ చైర్మన్‌‘రైతులు కస్టమర్‌ చార్జీలను చెల్లించాలి’
Advertisement
Advertisement