తోటకూర మామిడి పచ్చడి

ABN , First Publish Date - 2015-09-02T16:20:42+05:30 IST

కావలసిన పదార్థాలు: తోటకూర - మూడు కట్టలు, మామిడికాయ ముక్కలు - అర కప్పు, అల్లం ముక్క

తోటకూర మామిడి పచ్చడి

కావలసిన పదార్థాలు: తోటకూర - మూడు కట్టలు, మామిడికాయ ముక్కలు - అర కప్పు, అల్లం ముక్క - చిన్నది, నువ్వులు - ఒక టీస్పూను, పచ్చిమిర్చి - నాలుగు, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, ఉప్పు - రుచికి తగినంత, తాలింపు కోసం - చిటికెడు ఇంగువ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, నూనె - మూడు టేబుల్‌ స్పూన్లు. .
తయారుచేసే విధానం: కడాయిలో నువ్వులు వేసి దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో నూనె పోసి తరిగిన తోటకూర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగించి, ఈ మిశ్రమం చల్లారాక అందులో ఉప్పు, నువ్వులు, మామిడి ముక్కలు కలిపి మెత్తగా రుబ్బుకుని చివరిగా తాలింపు వేసుకోవాలి.

Updated Date - 2015-09-02T16:20:42+05:30 IST