రొయ్యల చట్నీ

ABN , First Publish Date - 2015-09-02T16:19:35+05:30 IST

కావలసిన పదార్థాలు: చిన్న రొయ్యలు - అరకేజీ, ఎండు కొబ్బరి పొడి - 1 టేబుల్‌ స్పూను, ధనియాలపొడి

రొయ్యల చట్నీ

కావలసిన పదార్థాలు: చిన్న రొయ్యలు - అరకేజీ, ఎండు కొబ్బరి పొడి - 1 టేబుల్‌ స్పూను, ధనియాలపొడి - 1 టేబుల్‌ స్పూను, జీరా - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, గరం మసాలా - అర టీ స్పూను, అల్లం వెల్లుల్లి - 1 టీ స్పూను, లెమన్‌ జ్యూస్‌ - 1 కప్పు, ఆవాలు - 1 టీ స్పూను, నూనె - 1 కప్పు, ఎండుమిర్చి - 2, కారం - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: రొయ్యలకు పసుపు, ఉప్పు పట్టించి కొద్ది నూనెలో నీరంతా ఇగిరేదాకా వేగించాలి (ఎక్కువ సేపు వేగిస్తే రొయ్య గట్టిపడిపోతుంది). వీటికి అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించి పక్కనుంచాలి. అదే కడాయిలో మిగతా నూనె వేసి ఎండుమిర్చి, జీరా, ఆవాలు, ధనియాల పొడి, కరివేపాకు వేగించి చల్లారనివ్వాలి. ఒక వెడల్పాటి పాత్రలో రొయ్యలు, లెమన్‌ జ్యూస్‌, కారం, ధనియాలపొడి, కొబ్బరిపొడి, గరం మసాలా బాగా కలిపి చల్లారిన పోపు వేసి కలపాలి.

Updated Date - 2015-09-02T16:19:35+05:30 IST