రేగిపండ్ల చారు

ABN , First Publish Date - 2016-12-19T20:36:51+05:30 IST

కావలసిన పదార్థాలు రేగిపండ్లు- ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు- 4, పచ్చిమిర్చి- 3, ఎండుమిర్చి- 2, జీలకర్ర- అర

రేగిపండ్ల చారు

కావలసిన పదార్థాలు
రేగిపండ్లు- ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు- 4, పచ్చిమిర్చి- 3, ఎండుమిర్చి- 2, జీలకర్ర- అర టీ స్పూను, ఆవాలు- ఒక టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, కరివేపాకు- 2 రెమ్మలు, కొత్తిమీర- కొద్దిగా, నువ్వుల పొడి- 2 టేబుల్‌ స్పూన్లు, బెల్లం- ఒక టేబుల్‌ స్పూను, మెంతులు- అర టీ స్పూను, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, ధనియాల పొడి- అర టీ స్పూను, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
రేగిపండ్లలో విత్తనాలను తీసేసి గుజ్జుగా చేసుకోవాలి. తర్వాత బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, రేగిపండ్లు గుజ్జు వేసి ఒక నిమిషంసేపు వేగాక 2 గ్లాసుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. తర్వాత ఉప్పు, నువ్వుల పొడి, బెల్లం, ధనియాల పొడి వేసి 2 నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి దించేయాలి.

Updated Date - 2016-12-19T20:36:51+05:30 IST