జీడిపప్పు మైసూర్ పాక్

ABN , First Publish Date - 2016-05-30T15:14:48+05:30 IST

కావలసిన పదార్థాలు: జీడిపప్పు పొడి, మైదా- ఒక్కోటి 1/3 కప్పు చొప్పున, నెయ్యి- 3 కప్పులు, యాలకుల పొడి- 1/2 టీ స్పూను, పంచదార- 3/4 కప్పు .

జీడిపప్పు మైసూర్ పాక్

కావలసిన పదార్థాలు: జీడిపప్పు పొడి, మైదా- ఒక్కోటి 1/3 కప్పు చొప్పున, నెయ్యి- 3 కప్పులు, యాలకుల పొడి- 1/2 టీ స్పూను, పంచదార- 3/4 కప్పు .
 
తయారీ విధానం: ఒక గిన్నెలో జీడిపప్పు పొడి, మైదా, యాలకుల పొడి, అరకప్పు వేడి నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత మరో గిన్నెలో పంచదార, 1/3 కప్పు నీళ్ళు పోసి తీగపాకం వచ్చే వరకూ మరిగించాలి. ఆ తరువాత మంట తగ్గించి జీడిపప్పు పొడి మిశ్రమాన్ని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో వేడి నెయ్యిని కొద్దికొద్దిగా కాస్త ఎత్తు నుంచి పోయాలి. ఇలా పదార్థం అంచుల నుంచి నెయ్యి వెలువడే వరకూ కలుపుతూ ఉండాలి. మైసూర్‌పాక్‌ తయారయిందనడానికి గుర్తు అర టీ స్పూను చల్లటి నీళ్ళు పదార్థంపై జల్లితే చిటపటలాడాలి. వెంటనే పదార్థాన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని వేడిగా ఉండగానే ముక్కలు కోసి, ఏదో ఒక మూల ఒక ముక్కను తీసి వేసి ఆవైపు పళ్ళేన్ని కాస్త పల్లంగా ఉంచాలి. దానివల్ల ఇంచు మించు కప్పుకు పైగా నెయ్యి బయటకు వచ్చేస్తుంది.

Updated Date - 2016-05-30T15:14:48+05:30 IST