Abn logo

డ్రైఫ్రూట్స్‌ పొంగల్‌

కావలసిన పదార్థాలు: బియ్యం: కప్పు, డ్రైఫ్రూట్స్‌(జీడిప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, బాదం): అరకప్పు, యాలకుల పొడి: చిటికెడు, పంచదార: నాలుగు లేదా ఐదు స్పూన్లు, నెయ్యి లేదా వెన్న: మూడు టేబుల్‌స్పూన్లు, కుంకుమ పువ్వు: చిటికెడు, పాలు: మూడు లేదా నాలుగు స్పూన్లు, నీళ్ళు: రెండు కప్పులు. 

తయారీ విధానం: కొద్దిగా పాలల్లో కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకొని అందులో నెయ్యి లేదా వెన్న వేసి కాగిన తరువాత డ్రైఫ్రూట్స్‌ వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కడిగిన బియ్యం వేసి దోరగా వేయించుకోవాలి. బియ్యం మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. బియ్యం వేగిన తరువాత సరిపడ నీరు పోసి ఉడికించాలి. బియ్యం మెత్తగా ఉడికిన తరువాత పంచదార, వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌ జతచేయాలి. దించే ముందు కుంకుమ పువ్వు, యాలకుల పొడి జతచేసి దించేయాలి. తీపి ఎక్కువ కావాలనుకునే వారు పంచదార కొద్దిగా ఎక్కు వగా వేసుకోవచ్చు.

వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే అభివృద్ధివిద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని కాంగ్రెస్‌ నిరసనఒక్క రోజే 20 కేసులునరక యాతన..అధ్వానంగా గ్రామీణ రోడ్లుగ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి మున్సిపల్‌ కమిషనర్‌ ఆకస్మిక తనిఖీమిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకేజీ కార్మిక హక్కుల సాధనే లక్ష్యంపంచాయతీల్లో నిధుల దుర్వినియోగం
Advertisement
d_article_rhs_ad_1
Advertisement