సొరకాయ పాయసం

ABN , First Publish Date - 2015-09-03T18:03:38+05:30 IST

కావలసిన పదార్థాలు : వేడి పాలు - రెండున్నర కప్పులు, సొరకాయ తురుము - 1కప్పు,

సొరకాయ పాయసం

కావలసిన పదార్థాలు : వేడి పాలు - రెండున్నర కప్పులు, సొరకాయ తురుము - 1కప్పు, పంచదార - 4 టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి - అర టీ స్పూను, కుంకుమపువ్వు - చిటికెడు (టీ స్పూను పాలల్లో నానబెట్టాలి), నెయ్యి - అర టేబుల్‌ స్పూను, జీడిపప్పు, బాదం - 10 చొప్పున.
తయారుచేసే విధానం : నెయ్యిలో (ముక్కలు చేసిన) జీడిపప్పు, బాదం దోరగా వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో సొరకాయ తురుమును 6 నిమిషాలు వేగించి పాలు కలిపి 15 నిమిషాలు సన్నని మంటపై ఉంచాలి. పాలు మరుగుతుండగా పంచదార వేసి మరో 10 నిమిషాలు ఉంచి యాలకుల పొడి, కుంకుమపువ్వు, వేగించిన జీడిపప్పు, బాదం చల్లి దించేయాలి. అతి సులభంగా చేసుకునే ఈ పాయసాన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

Updated Date - 2015-09-03T18:03:38+05:30 IST