Abn logo

పాలక్‌ మష్రూమ్‌ సూప్‌

కావలసిన పదార్థాలు: పాలకూర - 2 కట్టలు, వెల్లుల్లి - 6 రేకలు, మష్రూమ్స్‌ - 100 గ్రా., ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, పాలు - అరకప్పు, జాజికాయ పొడి - అర టీ స్పూను, బటర్‌ లేదా నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: బటర్‌/ నెయ్యిలో తరిగిన వెల్లుల్లిని సన్నటి మంటపై దోరగా వేగించాలి. తర్వాత సన్నగా తరిగిన మష్రూమ్స్‌ వేసి, నీరు ఆవిరై, గట్టిపడేవరకు వేగించాలి. ఇప్పుడు ఆవిరిపై ఉడికించి గ్రైండ్‌ చేసిన పాలకూర ప్యూరీ, ఉప్పు, మిరియాలపొడి కలిపి కొద్దిసేపు మరిగించాలి. పాలు పోసి, జాజికాయ పొడి చల్లి మూతపెట్టి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. సర్వ్‌ చేసేముందు సూప్‌పైన క్రీమ్‌తో గార్నిష్‌ చేయండి.

కార్మికులను విధుల్లోకి తీసుకోవాలిపెరుగుతున్న కరోనా కేసులుమత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట రైతువేదిక నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి వీరుల త్యాగఫలంపలువురు తహసీల్దార్ల బదిలీవ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధికి కృషి చేయాలికరోనా నియంత్రణకు నిరంతర కృషిఎడతెరపిలేని వర్షంక్వారంటైన్‌ కేంద్రాల్లో బాధితుల బెంబేలు
Advertisement
d_article_rhs_ad_1
Advertisement