వంకాయ పెరుగు పచ్చడి

ABN , First Publish Date - 2015-09-02T16:47:02+05:30 IST

కావలసిన పదార్థాలు: పెద్దవంకాయలు-2, పచ్చి మిరపకాయలు-2, ఎండు మిరపకాయలు

వంకాయ పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు: పెద్దవంకాయలు-2, పచ్చి మిరపకాయలు-2, ఎండు మిరపకాయలు-2, కొబ్బరి తురుము-2 చెంచాలు, ఆవాలు- అర చెంచా, ఇంగువ- అర చెంచా, నూనె-2 చెంచాలు, పెరుగు- 2 కప్పులు, ఉప్పు తగినంత
తయారీ విధానం :
వంకాయలకు నూనెరాసి సన్నని మంటపై కాల్చుకోవాలి. చల్లారాక తొక్కతీసి ముద్దగా చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొబ్బరి తురుము కలిపి రుబ్బుకోవాలి. దీన్ని వంకాయ గుజ్జు, ఉప్పు, పెరుగుతో కలుపుకోవాలి. ఆవాలు, ఇంగువ మిరప కాయలతో పోపు చేసి ఈ ముద్దకి చేర్చాలి. అంతే రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి రెడీ.

Updated Date - 2015-09-02T16:47:02+05:30 IST