Abn logo

మ్యాంగో ఐస్‌క్రీమ్‌

కావలసినవి
 
పాలు - కప్పు, క్రీమ్‌ - మూడు కప్పులు, మామిడిపండు - ఒకటి, మ్యాంగో ప్యూరీ - కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌ - టేబుల్‌ స్పూన్‌, వెనీలా - టేబుల్‌ స్పూన్‌, పంచదార - కప్పు.
 
తయారీవిధానం
 
పావు కప్పు పాలు తీసుకొని వాటిలో కస్టర్డ్‌ పౌడర్‌ కలిపి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పాలలో పంచదార వేసి వేడి చేయాలి. కాసేపయ్యాక కస్టర్డ్‌ మిశ్రమం వేసి మళ్లీ మరిగించాలి.
మిశ్రమం స్టవ్‌పై నుంచి దింపుకొని కాస్త చల్లారిన తరువాత మ్యాంగో ప్యూరీ, మామిడిపండు ముక్కలు, క్రీమ్‌, వెనీలా వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్టీల్‌ బాక్స్‌లోకి మార్చుకుని గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే... మ్యాంగో ఐస్‌క్రీమ్‌ రెడీ.

భూ మాయఏజెన్సీలోకి కరోనా ‘పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి’పదో తరగతి పరీక్ష సెంటర్లకు శానిటైజర్లుఉట్నూర్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌మొక్కల పెంపకానికి మియవాకీ పద్ధతి భేష్‌’ ఎస్సెస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిబాలుడిని ఆదుకోరూ...!గాంధీ ఆసుపత్రి నుంచి 23 మంది డిశ్చార్జిహత్య కేసులో దంపతుల అరెస్టు
Advertisement
d_article_rhs_ad_1
Advertisement