గుడ్డు మసాలా

ABN , First Publish Date - 2018-08-12T16:01:49+05:30 IST

గుడ్లు : నాలుగు, నూనె : టేబుల్‌ స్పూన్, జీలకర్ర : టీ స్పూన్..

గుడ్డు మసాలా

కావలసిన పదార్థాలు
 
గుడ్లు : నాలుగు, నూనె : టేబుల్‌ స్పూన్, జీలకర్ర : టీ స్పూన్, ఉల్లిపాయ : ఒకటి, దాల్చిన చెక్క : 3 అంగుళాల ముక్క, ధనియాల పొడి : 2 టీస్పూన్లు, ఎండుమిర్చి పొడి : అర టీస్పూన్(కొంచెం పొడి చేసుకోవాలి), పసుపు : అర టీ స్పూన్, వెల్లుల్లి : రెండు రెబ్బలు, ఉప్పు : తగినంత, టమోటా : రెండు, మంచి నీళ్లు : కప్పు, కొత్తిమీర తురుము : టేబుల్‌ స్పూన్
 
తయారు చేసే పద్ధతి
 
ముందుగా కోడిగుడ్లను ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత పెంకు తీసి కాసేపు మంచినీళ్లలో వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల తెల్లసొన సాగకుండా ఉంటుంది. ఇప్పుడు పెనం తీసుకుని స్టౌ పెట్టి నూనె వేయాలి. కాగాక జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత దాల్చిన చెక్క ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత ధనియాల పొడి, ఎండుమిర్చి పొడి, పసుపు, వెల్లుల్లి, ఉప్పు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత సిమ్‌లో పెట్టి సన్నగా తరిగిన లేదా రుబ్బిన టమోటా గుజ్జు వేసి, నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. గ్రేవీ పచ్చివాసనపోయి, మంచి వాసన వస్తూ దగ్గరగా ఉడికిన తర్వాత గుడ్లను సగానికి కోసి కూరలో వేసి మరికాసేపు ఉడికించి దించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.

Updated Date - 2018-08-12T16:01:49+05:30 IST