Abn logo

గోరు చిక్కడు పకోడీలు

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
గోరుచిక్కుడు తరుగు - ఒక కప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, శనగపిండి - ముప్పావు కప్పు, బియ్యప్పిండి - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పచ్చిమిర్చి - 2, అల్లంవెల్లుల్లి పేస్టు - అర టీ స్పూను, జీలకర్ర - పావు టీ స్పూను, కొత్తిమీర తరుగు - అర కప్పు, నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం
 
గోరుచిక్కుడు తరుగు ముప్పావు వంతు ఉడికించి నీరు వడకట్టాలి. ఒక లోతైన గిన్నెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, బియ్యప్పిండి, జీలకర్ర, ఉడికించిన గోరుచిక్కుడు తరుగు వేసి ఆ తర్వాత కొద్దికొద్దిగా శనగపిండి వేస్తూ ముద్దలా చేసుకోవాలి. అవసరం అనుకుంటే నీరు చల్లుకోవచ్చు. బాణలిలో నూనె వేడెక్కిన తర్వాత పిండిమిశ్రమాన్ని చేత్తో కొంత కొంత తీసుకుని పకోడీలుగా వేసి దోరగా వేగించాలి. ఇవి సాయంత్రం స్నాక్స్‌గా లేదా, సాంబారన్నంతో సైడ్‌ డిష్‌గా బాగుంటాయి.

Telangana: సింగరేణిలో మ్రోగిన సమ్మె సైరన్బిపిన్‌ రావత్‌కు ఘన నివాళికౌంటింగ్‌ ఏర్పాట్లను పూర్తి చేయాలిలక్ష్యం దిశగా..!రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలిడబుల్‌బెడ్‌రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి విద్యావలంటీర్లను నియమించండిఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలిచెన్నూరు టూ మహారాష్ట్ర‘బెల్ట్‌’ దందా షురూ
Advertisement