వంకాయ ఉప్మా

ABN , First Publish Date - 2015-09-05T17:37:02+05:30 IST

కావలసిన పదార్థాలు: (లేత) పొడవు వంకాయలు - 4, బొంబాయి రవ్వ - 2 కప్పులు, పచ్చిమిర్చి

వంకాయ ఉప్మా

కావలసిన పదార్థాలు: (లేత) పొడవు వంకాయలు - 4, బొంబాయి రవ్వ - 2 కప్పులు, పచ్చిమిర్చి - 3, అల్లం తరుగు - 1 టీ స్పూను, జీడిపప్పు -10, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు + మినప్పప్పు- 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: జీడిపప్పుని, రవ్వని విడివిడిగా నేతిలో వేగించాలి. వంకాయల్ని సన్నగా పొడుగ్గా తరిగి ఉప్పునీటిలో వేసి ఉంచాలి. కడాయిలో మిగతా నెయ్యి వేసి ఆవాలు, మినప్పప్పు వేగాక అల్లం, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు , వంకాయముక్కలు, జీడిపప్పు వేయాలి. కడాయిపై మూతపెట్టి సన్న సెగమీద వంకాయ ముక్కలు మగ్గించాలి. తర్వాత 4 గ్లాసుల నీరు పోసి, ఉప్పు జతచేయాలి. నీరు మరుగుతుండగా రవ్వను వేసి అడుగంటకుండా తిప్పాలి. ఈ ఉప్మా వంకాయ వాసనతో కొత్త రుచిగా ఉంటుంది. ఇదే పద్ధతిలో వంకాయల బదులు క్యాప్సికం, పచ్చిబఠాణి, కారెట్‌, మొక్కజొన్న, ఆలూలతో కూడా చేసుకోవచ్చు.

Updated Date - 2015-09-05T17:37:02+05:30 IST