Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్యారెట్‌, కుకుంబర్‌ రైతా

an style="color: red;">కావలసిన పదార్థాలు: క్యారెట్‌ తురుము - అర కప్పు, కీరదోసకాయ - అరకప్పు(తురుము లేదా ముక్కలు), పెరుగు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 4, శనగపప్పు - 1 టీ స్పూను, మినప్పప్పు - 1 టీ స్పూన, ఆవాలు - 1 టీ స్పూన, జీలకర్ర - అర టీ స్పూన, ఎండుమిర్చి - 6, కరివేపాకు - రెండు రెమ్మలు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, ధనియాలపొడి - అర టీ స్పూన, జీలకర్ర పొడి - అర టీ స్పూన, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు
తయారుచేయు విధానం: ముందుగా పానలో నూనె వేసి కాగాక క్యారె ట్‌ తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి పక్కన ఉంచాలి. తర్వాత గిన్నెలో పెరుగు, ఉప్పు, పసుపు కొద్దిగా నీళ్ళు వేసి గిలక్కొట్టాలి. ఇప్పుడు మరో డీప్‌ ఫ్రైయింగ్‌ పానలో నూనె వేసి కాగాక అందులో ఎండు మిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి. చిలికిన పెరుగులో వేయించి ఉంచుకున్న క్యారెట్‌ తురుము వేసి కలపాలి. వేయించి ఉంచుకున్న పోపు కూడా జోడించాలి. ఇప్పుడు కీరదోసకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. అంతే క్యారెట్‌ రైతా రెడీ. ఇది అన్నంలోకి, రోటీలలోకి బాగుంటుంది.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement