Abn logo

గుమ్మడి రైతా

కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 2, పచ్చికొబ్బరి ముక్కలు - అరకప్పు, పెరుగు - 3 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, పుట్నాలు - 1 టేబుల్‌ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు, శనగపప్పు - 1 టీ స్పూను, మినప్పప్పు - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఆవాలు - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: గుమ్మడి ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి, పుట్నాలు, కొబ్బరి గ్రైండ్‌ చేసుకోవాలి. కొబ్బరి మిశ్రమం, ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉప్పు పెరుగులో వేసి కలపాలి. తర్వాత కడాయిలో నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పసుపు, కరివేపాకులతో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ రైతా బ్రెడ్‌తో చాలా బాగుంటుంది.

అడవుల జల్లెడ..సరిహద్దుపై నిఘామద్యం మత్తులో..భార్యను హత్య చేసిన భర్తఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానంగిరిజన మహిళ ఆత్మహత్యపై విచారణ వేగవంతం చేయాలికొనసాగుతున్న ‘కరోనా’ ఉధృతిముందుచూపేదీ?మన్యంపై మావోయిస్టుల నీడడాక్యుమెంట్‌ రైటర్లకు మళ్లీ లైసెన్సులు...?అయ్యో.. సారూ!అధికారులు సమన్వయంతో పనిచేయాలి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement