Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పూరీ అరెసెలు

పూరీ అరెసెలు

కావ

లసినవి: గోధుమ పిండి- గిన్నెడు, బొంబాయి రవ్వ- పావు గిన్నెడు, నూనె- రెండు లేక మూడు టేబుల్‌ స్పూన్‌లు, పెరుగు - రెండు టేబుల్‌ స్పూన్‌లు,
సిరప్‌ కోసం: పంచదార, రెండు గిన్నెలు నీళ్లు - గిన్నెలో మూడుపావులు కొలత, కుంకుమ పువ్వు చిటికెడు, నిమ్మరసం- మూడు టేబుల్‌ స్పూన్‌లు
తయారీ విధానం
గోధుమ పిండి, రవ్వలో రెండు స్పూన్‌లు నూనె, పెరుగు వేసి నీళ్లు సరి చూసుకుంటూ పిండి చేతులకు అంటకుండా ఉండేలా మెత్తగా కలపాలి. పిండిపై తడి బట్టను కప్పి ఒక గంట నాననివ్వండి. తర్వాత పదిపదిహేను నిమిషాల పాటు పిండిని మృదువుగా అయ్యేలా మర్దనా చేయండి. పంచదారని తీగపాకం వచ్చేలా ఉడికించండి. చిటికెడు కుంకుమ పువ్వు, నిమ్మరసం దాని కి చేర్చి సన్నని సెగమీద ఉంచుకోండి. పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసుకుని పూరీలలా వత్తుకోండి. వాటిని ముదురు ఎరుపు రంగు వచ్చేంత వరకూ వేగించి వేడివేడిగా పంచదార పాకంలో వేసి పూర్తిగా మునిగేలా చూసుకోం డి. ఐదు నుంచి పది నిముషాలు నాననిచ్చి తీసి వాటిని ఏటవాలుగా ఏదైనా ప్లేటులో అమర్చండి. దాని వలన వాటికి ఎక్కువగా ఉన్న పాకం జారిపోతుంది. చల్లారిన తరువాత ఈ పూరీ అరిసెలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి.

టెన్త్‌పేపర్‌ లీక్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోండిటెన్త్‌పేపర్‌ లీక్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోండిఆగస్టు 15 లోగా కలెక్టరేట్‌ భవన నిర్మాణం పూర్తి చేయండిఆగస్టు 15 లోగా కలెక్టరేట్‌ భవన నిర్మాణం పూర్తి చేయండివైభవంగా కాల్వ లక్ష్మీనరసింహస్వామి కల్యాణంవైభవంగా కాల్వ లక్ష్మీనరసింహస్వామి కల్యాణంపావలావడ్డీ ఫట్‌పావలావడ్డీ ఫట్‌గౌతమబుద్ధుడి మాటలు స్ఫూర్తిదాయకంగౌతమబుద్ధుడి మాటలు స్ఫూర్తిదాయకంఅర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలిఅర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలివానాకాలం ప్రణాళిక సిద్ధంవానాకాలం ప్రణాళిక సిద్ధంఆసిఫాబాద్‌ జిల్లాలో విచ్చలవిడిగా గుట్కా దందాఆసిఫాబాద్‌ జిల్లాలో విచ్చలవిడిగా గుట్కా దందాదళితుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యందళితుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంసబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లను సద్వినియోగం చేసుకోవాలి సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లను సద్వినియోగం చేసుకోవాలి
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.