‘ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్’ పేరుతో బెంగాల్‌లో కొత్త పార్టీ

ABN , First Publish Date - 2021-01-21T23:02:46+05:30 IST

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బెంగాల్‌లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ ముస్లిం నేత అబ్బాస్ సిద్దిఖీ ‘ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్’

‘ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్’ పేరుతో బెంగాల్‌లో కొత్త పార్టీ

కోల్‌కతా : ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బెంగాల్‌లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ ముస్లిం నేత అబ్బాస్ సిద్దిఖీ ‘ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్’ పేరుతో ఓ కొత్త పార్టీని స్థాపించారు. సొంతంగా ఓ పార్టీని స్థాపించాలా? లేదంటే... ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలా? అన్న విషయంపై ఆయన కొన్ని రోజులుగా సతమతమవుతున్నారు. చివరికి సొంత పార్టీ వైపే ఆయన మొగ్గు చూపారు. ఈ సందర్భంగా సిద్ధిఖీ మాట్లాడుతూ... దేశంలో తమదే నిజమైన సెక్యులర్ పార్టీ అని, అణగారిన వర్గాలను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే తమ కర్తవ్యమని ప్రకటించారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి చాలా మంది తమది సెక్యులర్ పార్టీ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారని, కానీ ఎవ్వరూ ఆ పాయింట్ మీద నిలబడలేదని ఆరోపించారు. ముస్లింలు, దళితులు ఇంకా వెనకబడే ఉన్నారని, వారందర్నీ అభివృద్ధి చేయడమే తమ కర్తవ్యమని సిద్దిఖీ ప్రకటించారు. 

Updated Date - 2021-01-21T23:02:46+05:30 IST