సౌర విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అబ్‌ ఇన్బెవ్‌ ఇండియా అడుగులు

ABN , First Publish Date - 2021-04-21T01:36:45+05:30 IST

సౌర విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అబ్‌ ఇన్బెవ్‌ ఇండియా అడుగులు

సౌర విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అబ్‌ ఇన్బెవ్‌ ఇండియా అడుగులు

హైదరాబాద్: ఆహ్లాదకరమైన భవిష్యత్‌ నిర్మించే దిశగా తమ నిబద్ధతను మరింతగా పునరుద్ఘాటిస్తూ తెలంగాణాలోని అబ్‌ ఇన్బెవ్‌ ఇండియా యొక్క క్రోన్‌ బ్రూవెరీ ఇప్పుడు సౌర విద్యుత్‌ దిశగా అడుగులు వేస్తుంది. తమ బ్రూవింగ్‌ కార్యకలాపాల వ్యాప్తంగా గ్రీన్‌ విద్యుత్‌ స్వీకరణనూ వేగవంతం చేస్తుంది. తమ మూడవ బ్రూవరీలో పునరుద్పాదక విద్యుత్‌ను స్వీకరించడం ద్వారా అబ్‌ ఇన్బెవ్‌ యొక్క అంతర్జాతీయ నిబద్ధతను పునరుద్ఘాటించడంతో పాటుగా 2025 నాటికి పునరుత్పాదక వనరుల నుంచి 100శాతం విద్యుత్‌ను కొనుగోలు చేయాలనే కంపెనీ నిబద్ధతనూ వెల్లడిస్తుంది. మైసూరు మరియు ఔరంగాబాద్‌లలోని ప్రపంచంలోనే సుప్రసిద్ధమైన బ్రూవర్‌ సదుపాయాలు గతంలో పాక్షికంగా పునరుత్పాదక విద్యుత్‌ దిశగా మళ్లాయి. క్రోన్‌ బ్రూవరీ వద్ద సౌర విద్యుత్‌ ప్యానెల్స్‌ కోసం ఈ ప్రాజెక్ట్‌ సామర్థ్యం డీసీ 998 కెడబ్ల్యుపీ, ఏసీ 773 కిలోవాట్లు. ఇది రమారమి రోజుకు 4వేల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా రోజుకు 22వేల యూనిట్ల విద్యుత్‌ అవసరమైన అబ్‌ ఇన్బెవ్‌ ఇండియాకు 18శాతం విద్యుత్‌ ఇప్పుడు పునరుత్పాదక వనరుల ద్వారా లభిస్తుంది.


Updated Date - 2021-04-21T01:36:45+05:30 IST