ఎదురుచూపులు..కొత్త పింఛన్లు వస్తయా.. రావా..?

ABN , First Publish Date - 2020-10-17T06:21:19+05:30 IST

ప్రభుత్వం అమలుచేస్తున్న ఆసరా పింఛన్‌ పథకం అభాసుపాలవు తోంది.

ఎదురుచూపులు..కొత్త పింఛన్లు వస్తయా.. రావా..?

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దివ్యాంగులు 

ధర్నాలు చేసినా నిరుపయోగమే..


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ప్రభుత్వం అమలుచేస్తున్న ఆసరా పింఛన్‌ పథకం అభాసుపాలవు తోంది. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు పింఛను డబ్బు ఇవ్వడంలో తీవ్రజాప్యం చేస్తోంది. డబ్బు కోసం రెం డేళ్లుగా ఎదురుచూస్తున్నారు. నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దివ్యాంగులు కలె క్టరేట్‌ వద్ద ధర్నా చేపడుతున్నా ఎలాంటి స్పందన లేకుండా పోతోంది. పింఛను కోసం ఎదురుచూసి చివ రకు మృతి చెందిన వృద్ధులు కూడా ఉన్నారు. పింఛను కోసం టెన్షన్‌ తప్పడం లేదు. మంజూరైన కొత్త పింఛన్లు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండేళ్లుగా పింఛను కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తు న్నారు. ఇప్పట్లో కొత్త పింఛన్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రెండుళ్లుగా నిరీక్షించిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పెన్షన్‌ వస్తదా... రాదా.. అనే విష యంపై ఆందోళన చెందుతున్నారు.


దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలను ఆదు కునేందుకు ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులోభాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాం గులు, గీతాకార్మికులు, చేనేత, బీడీ కార్మికులకు పింఛన్లు అందజేస్తుంది. 65ఏళ్లు నిండినవారికి ఆసరా అందుతోంది. ఇదివరకు దివ్యాంగుల పింఛను రూ.1,500 ఉండగా వాటిని 3,016కు, ఇతరులకు రూ.1000 ఉన్నది రూ. 2016కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పెంచిన పింఛను 2019 జూన్‌ నుంచి వర్తింప చేశారు. రంగారెడ్డి జిల్లాలో  1,69,688మంది ఆసరా పింఛను తీసుకుంటున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 12,280 మంది లబ్ధిదారులకు మంజూరయ్యాయి. వీరందరికీ పింఛను ఎప్పుడు ఇస్తారనే విషయంపై అధికారుల్లో స్పష్టత కరువైంది. 


వయసు కుదింపు ఏమైంది?

ప్రస్తుతం 65ఏళ్లు నిండినవారికి మాత్రమే ఆసరా పింఛన్‌ వస్తోంది. ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామని, వృద్ధాప్య పింఛన్‌ వయస్సు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దీనిలో పింఛన్ల పెంపును అమలుచేశారు. వయసు తగ్గించక పోవడంతో వేలాది మంది వృద్ధులు నిరాశకు గురవుతున్నారు. ఓటరు జాబితాను ప్రామా ణికంగా తీసుకుని 57ఏళ్ల వయసు ఉన్నవారిని 31,947 వేలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో గ్రామీ ణాభివృద్ధి శాఖ అధికారులు ఆ జాబితా, ప్రయత్నాలను పక్కన పెట్టారు. 


ప్రభుత్వానికి పంపించాము - రాజేశ్వర్‌రెడ్డి, డీఆర్‌డీవో ఇన్‌చార్జి పీడీ 

పింఛను దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్‌ అను మతితో డేటాను ప్రభు త్వానికి పంపించడం జరి గింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే అర్హులైన వారందరికీ పింఛన్లు వస్తాయి. పింఛను రావడం లేదని ఎవరూ ఆందోళన చెందవద్దు.


పింఛన్‌ ఇప్పించండి సారూ..మానసిక దివ్యాంగుడు గణేష్‌

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శనిగళ్ల నర్సింహులు. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు. ఇతని వయసు 38ఏళ్లు. పారిశుధ్య పనులు చేస్తున్న సమయంలో క్యూలెక్స్‌ దోమ కుట్టింది. పైలేరియా అనే సూక్ష్మ క్రిమి ద్వారా బోదకాలు వ్యాధి సోకింది. రోజురోజుకూ కాలు వాపు పెరిగిపోతోంది. ఆరేళ్లుగా నరకం అనుభవిస్తున్నాడు. గ్రామంలో పారిశుధ్య పనులను భర్తకు బదులుగా భార్య లక్ష్మి చేస్తుంది. ఆమెకు వచ్చే 8,500 జీతంలో సగం డబ్బులు నర్సింహులు వైద్యానికే ఖర్చ వుతోంది. వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక పోవడంతో మందులు వేసుకోవడమే మానేశాడు. దీంతో బోదకాలు మరింతగా పెరిగింది. పింఛను కోసం ఇప్పటికీ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన హైమద్‌ నర్సింహులు ఎదుర్కొంటున్న కష్టాలను సోషల్‌ మీడియాలో పోస్టుచేయగా.. కొంతమంది దాతలు తోచిన సహాయాన్ని చేస్తున్నారు. 


రెండేళ్ల క్రితం ఆగిన పింఛన్‌..వృద్దురాలు బాలమ్మ

ఈ యువకుడి పేరు మల్కాపురం గణేష్‌. అతను మానసిక దివ్యాంగుడు. ఇదే కుటుంబానికి చెందిన బాలమ్మ వయస్సు 74ఏళ్లు. ఊరు తక్కళ్లపల్లి. 2018లో ఇరువురికి పింఛను వచ్చేది. అధికారుల తప్పిదం వల్ల రెండేళ్లక్రితం వారికి పింఛను ఆగింది. పింఛను కోసం యాచారం ఎంపీడీవోను కలిశారు. ఒకే సర్టిఫికెట్‌పై ఇద్దరికి పింఛను వస్తుందని అందుకే పింఛను నిలిపివేశారని తెలిపారు. మళ్లీ రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఎవరూ లేరు  పింఛను ఇప్పించాలని తక్కళ్లపల్లి ఉప సర్పంచ్‌ పగడాల శ్రీశైలం జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైనును కోరారు.


రంగారెడ్డి జిల్లాలో ఆసరా పింఛన్ల వివరాలు

పింఛన్‌ రకాలు లబ్ధిదారులు పెండింగ్‌లో..

వృద్ధాప్య 56,112     3522

వితంతు 77,647 5905

వికలాంగులు 27,103 2030

కల్లుగీత 2,068 236

చేనేత 766 60

బీడీ కార్మికులు 16 0

ఒంటరి మహిళ 5976 527

మొత్తం  1,69,688 12,280

Updated Date - 2020-10-17T06:21:19+05:30 IST