Abn logo
Jan 24 2021 @ 02:53AM

ఆప్‌ ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు, జరిమానా

న్యూఢిల్లీ, జనవరి 23: ఎయిమ్స్‌ భద్రతా సిబ్బందిని కొట్టిన కేసులో ఆప్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమ్‌నాథ్‌ భారతికి స్థానిక కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, ఒక లక్ష జరిమానా విధించింది. అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ రవీంద్రకుమార్‌ పాండే శనివారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. అయితే దీనిపై సోమ్‌నాథ్‌ భారతి ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా మెజిస్ట్రేట్‌ ఆయనకు బెయిలిచ్చారు.  

Advertisement
Advertisement
Advertisement