Ayodhya: జైశ్రీరామ్ నినాదాల మధ్య అయోధ్యలో ఆదిత్య థాకరే

ABN , First Publish Date - 2022-06-15T21:41:23+05:30 IST

మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే ఆయోధ్య పర్యటన కోసం బుధవారం ఉదయం..

Ayodhya: జైశ్రీరామ్ నినాదాల మధ్య అయోధ్యలో ఆదిత్య థాకరే

లక్నో: మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే ఆయోధ్య పర్యటన కోసం బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్నారు. ఇది రాజకీయేతర పర్యటనగా శివసేన ఇప్పటికే ప్రకటించింది. లక్నో విమానాశ్రయం వద్ద ఆదిత్యకు పెద్దఎత్తున శివసేన కార్యకర్తలు స్వాగతం పలికారు. జైశ్రీరామ్ నినాదాలను కార్యకర్తలు హోరెత్తించారు. పవిత్రమైన అయోధ్యలో పర్యటించేందుకు తాను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టు ఆదిత్య ఈ సందర్భంగా అన్నారు.


''అయోధ్య అందరి విశ్వాసాలకు ప్రతీక. రామునితో అనుసంధానమైన పవిత్ర ప్రాంతం ఇది. 2018, 2019లో కూడా నేను చాలాసార్లు ఇక్కడకు వచ్చాను. రామ్ లల్లాను దర్శించుకుని, ఆశీస్సులు తీసుకునేందుకు మాత్రమే ప్రస్తుతం ఇక్కడకు వచ్చాను. రాజకీయలతో సంబంధం లేదు.'' అని ఆదిత్య థాకరే తెలిపారు. అనంతరం ఆయన అయోధ్యకు బయలుదేరారు. ఆయన వెంట మహారాష్ట్ర, యూపీకి చెందిన వందలాది మంది శివసేన కార్యకర్తలు మోటారు వాహనాలపై అనుసరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీరాముని భవ్యమందిరాన్ని ఆదిత్య దర్శించడంతో పాటు సాయంత్రం సరయు హారతిలో పాల్గొంటారు.

Updated Date - 2022-06-15T21:41:23+05:30 IST