‘ఆధార్‌’ కష్టాలకు చెక్‌!

ABN , First Publish Date - 2021-06-25T05:19:39+05:30 IST

‘ఆధార్‌’ సేవలను సులభతరం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆధార్‌ కార్డుల్లో తప్పులను సవరించేందుకు పట్టణాల్లో కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఈ కష్టాలకు చెక్‌ పెట్టి.. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ‘ఆధార్‌’ సేవలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల రెండో వారం నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలో 500 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి ఇటీవల జీవో నెంబర్‌ 156 జారీ చేసింది. ఈ మేరకు జిల్లాకు సంబంధించి మండలానికి ఒక సచివాలయంలో ఈ సేవలు అందజేసేలా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

‘ఆధార్‌’ కష్టాలకు చెక్‌!
నరసన్నపేటలో ఆధార్‌ అనుసంధానం కోసం పడిగాపులు కాస్తున్న ప్రజలు

- ఇకపై గ్రామ, వార్డు సచివాయాల్లో ‘ఆధార్‌’ సేవలు 

- ఇకపై గ్రామ, వార్డు సచివాయాల్లో సేవలు 

- పైలట్‌ ప్రాజెక్టుగా వచ్చే నెల నుంచి అమలు 

- మండలానికి ఒక కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు

నరసన్నపేట, జూన్‌ 24 : ‘ఆధార్‌’ సేవలను సులభతరం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆధార్‌ కార్డుల్లో తప్పులను సవరించేందుకు పట్టణాల్లో కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఈ కష్టాలకు చెక్‌ పెట్టి.. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ‘ఆధార్‌’ సేవలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల రెండో వారం నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలో 500 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి ఇటీవల జీవో నెంబర్‌ 156 జారీ చేసింది. ఈ మేరకు జిల్లాకు సంబంధించి మండలానికి ఒక సచివాలయంలో ఈ సేవలు అందజేసేలా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 

ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరికీ కీలకంగా మారింది. ప్రభుత్వ పథకాలు వర్తించాలన్నా, విద్యా రుణాలు పొందాలన్నా.. ప్రస్తుత కరోనా వేళ కొవిడ్‌ పరీక్షలు చేసుకోవాలన్నా.. ఇలా అన్నింటికీ ‘ఆధార్‌’ నెంబర్‌ ఉండాల్సిందే. ఆధార్‌తో బయోమెట్రిక్‌, ఫోన్‌ నెంబర్‌ అనుసంధానం చేస్తేనే వివిధ ప్రభుత్వ పథకాలు మంజూరవుతాయి. ఆధార్‌లో పుట్టిన తేదీ, సంవత్సరం, తదితర వివరాలన్నీ పక్కాగా ఉంటేనే పథకాలు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ను సైతం లెక్క చేయకుండా ఆధార్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులుదీరుతూనే ఉన్నారు. మార్పులు చేర్పుల కోసం ఎండలో సైతం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. పరిమితంగా ఆధార్‌ కేంద్రాలు ఉండడంతో సవరణల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించే రుసుం కన్నా.. అధికంగా చెల్లిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సేవలు అందితే ప్రజలకు ఇబ్బందులు తొలగనున్నాయి.  ప్రభుత్వం ఈ బాధ్యతలను జిల్లా సచివాలయ వ్యవస్థ జేసీలకు అప్పగించింది. ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలో ఒక్కో మండలానికి ఒక సచివాలయాన్ని ఎంపిక చేయనున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు పలాస, ఇచ్ఛాపురం, రాజాం, ఆమదాలవలస మునిసిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీలో ఒక్కో సచివాలయంలో ‘ఆధార్‌’ సేవలు అందజేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.  సచివాలయాల్లో ఆధార్‌ సవరణపై దరఖాస్తులు అందిస్తారు. ఇందుకు సంబంధించి ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఆధార్‌ కార్డు పొందేందుకు రూ.100, బయోమెట్రిక్‌ అప్‌డేట్‌కు రూ.100, ఇతర సవరణల కోసం రూ.100, ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు రూ.30 ఫీజు వసూలు చేయనున్నారు. సచివాలయాల్లో ఆధార్‌ సేవలు లభిస్తే తమకు కాస్త ఇబ్బందులు తప్పుతాయని ప్రజలు భావిస్తున్నారు.   

Updated Date - 2021-06-25T05:19:39+05:30 IST