పారదర్శకత కోసమే ఓటుకు ఆధార్‌ అనుసంధానం

ABN , First Publish Date - 2022-08-02T05:34:47+05:30 IST

ఓటుకు ఆధార్‌తో అనుసంధానించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని.. పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేస్తామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆధార్‌ సీడింగ్‌ ప్రక్రియకు సంబంధించి అన్ని రాజకీయ పక్షాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

పారదర్శకత కోసమే ఓటుకు ఆధార్‌ అనుసంధానం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌
అరసవల్లి, ఆగస్టు 1:
ఓటుకు ఆధార్‌తో అనుసంధానించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని.. పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేస్తామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆధార్‌ సీడింగ్‌ ప్రక్రియకు సంబంధించి అన్ని రాజకీయ పక్షాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 17 సంవత్సరాలు నిండిన యువతకు ఓటరుగా ముందస్తు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. సవరించిన ప్రజాప్రాతినిథ్య చట్టం-1950లోని సెక్షన్‌-23 ప్రకారం ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారు, నమోదు కావాలనుకునే వారు తమ ఆఽధార్‌ సంఖ్యను ఓటర్‌ ఐడితో జతపరచాల్సి ఉంటుందన్నారు.  2023 మార్చి నెలాఖరు నాటికి ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ పూర్తిచేయా లన్నారు.. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు లేకుం డా చేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ నెల 4 నుంచి ఆధార్‌ సీడింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.  పోలింగ్‌ స్టేషన్లు  ఓటర్లకు దూరంగా ఉన్నా, ఇబ్బందులు ఉన్నా మార్చుకోవచ్చని తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో జాబితా నిరంతరంగా ఉంటుందని, వలస వెళ్లిన ఓటర్లు, మృతిచెందిన వారిని జాబితా నుంచి తొలగించాలని కోరారు. ఆధార్‌ సీడింగ్‌ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. కొత్తగా ఓటరు నమోదుకు ఫారం-6, వివరాల సవరణకు ఫారం-8, పేరు తొలగింపునకు ఫారం-7, ఆధార్‌ కార్డుతో ఓట రు ఐడీ అనుసంధానానికి ఫారం-6బి వినియోగించాలని సూచించారు. టీడీపీ నేత పీఎంజే బాబు మాట్లాడుతూ వేరే ప్రాంతాలకు చెందినవారు శ్రీకాకుళంలో నివసిస్తున్నా రని, వారికి ఓటర్లుగా నమోదుచేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు.  బల్క్‌ దరఖాస్తులను తీసుకోవద్దని కోరారు. వైసీపీ నేత పాలిశె ట్టి మధుబాబు మాట్లాడుతూ జిల్లా విభజన నేపథ్యంలో తలెత్తిన ఇబ్బం దులను పరిష్కరించాలని కోరారు. అనంతరం అవగాహనా పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు.సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.విజ యసునీత, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రా జేశ్వరి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు రవిబాబ్జీ, ఉమామహేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జనసేన నాయకుడు గురునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు అభినందన
 జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని చెటిచెప్పిన ఉషూ క్రీడాకారులు రుప్ప తన్మయి, రుప్ప నరేంద్రనాయుడు, జి.ధనుష్‌ కుమార్‌లను కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, జేసీ విజయసునీతలు అభినందించారు.   హిమా చల్‌ప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల కు జిల్లా నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. రెండు కాంస్యం, ఒక రజత పతకం సాధించారు. డీఎస్‌డీవో ఎం.మాధురీలత, యువజన సర్వీసు లశాఖ అధికారి ఎం.ప్రసాదరావు, తైక్వాండో అసోసి యేషన్‌ కార్యదర్శి కొమర భాస్కరరావు పాల్గొన్నారు.

నియామక పత్రాలు అందజేత
 విధి నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ సూచించారు. సోమవారం జడ్పీ సమావేశ మంది రంలో వైద్యఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. జేసీ విజయసునీత, జిల్లా రెవె న్యూ అధికారి ఎం.రాజేశ్వరి, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి, డాక్టర్‌ అనూరాధ పాల్గొన్నారు.

సత్యసాయి సేవాసమితి చేయూత
జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం స్పందన విభాగానికి వచ్చిన వారికి సత్యసాయి సేవా కేంద్రం, భజన మండలి వారు భోజన ఏర్పాట్లు చేశారు.  కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ చేతులమీదుగా భోజన ప్యాకెట్లు అందజేశారు. సంఘ ప్రతినిధులు బీవీ భాస్కరరావు, వై.లింగరాజు, రమణబాబు, నరసింగరావు, రామచంద్రరావు, టిఎస్‌ఎన్‌.మూర్తి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-02T05:34:47+05:30 IST