‘ప్రధాన మంత్రి గారూ.. ఆదుకోండి’

ABN , First Publish Date - 2020-07-13T13:45:22+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారూ.. తెలుగు రాష్ట్రాల ఆదర్శ్‌ ఖాతాదారులను ఆదుకోండి అంటూ ఆదర్శ్‌ డిపాజిటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వేడుకున్నారు. ఆదర్శ్‌ క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లి.లో దాచుకున్న

‘ప్రధాన మంత్రి గారూ.. ఆదుకోండి’

కొత్తపేట, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారూ.. తెలుగు రాష్ట్రాల ఆదర్శ్‌ ఖాతాదారులను ఆదుకోండి అంటూ ఆదర్శ్‌ డిపాజిటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వేడుకున్నారు. ఆదర్శ్‌ క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లి.లో దాచుకున్న డబ్బు తమకు ఇప్పించాలని, జీవిత చరమాంకంలో ఉన్న తాము అప్పుల్లో కూరుకుపోయామని ఆదర్శ్‌ డిపాజిటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చుండి సింగయ్య, ముఖ్య కార్యదర్శి వీ సుబ్బారాయుడు, కోశాధికారి డీ రామ్మోహనరావు ప్రధాన మంత్రికి విన్నవించారు. ఆదివారం ఎల్‌బీనగర్‌, న్యూ నాగోల్‌ సీనియర్‌ సిటిజన్ల భవనంలో అసోసియేషన్‌ ప్రతినిధులు నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అహ్మదాబాద్‌లో ముఖే్‌షమోడీ, రాహుల్‌మోడీ ఆదర్శ్‌ క్రెడిట్‌ కో - ఆపరేటివ్‌ సొసైటీ లి.ను ఏర్పాటు చేశారు. అందులో తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు, వ్యాపారులు రోజు వారీ, నెల నెలా రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రికరింగ్‌ డిపాజిట్లు చేశారు. రెండేళ్ల నుంచి తాము జమ చేసిన డబ్బుపై రావాల్సిన డివిడెండ్లు, మెచ్యూరిటీ రికరింగ్‌ డిపాజిట్‌ డబ్బు, ఫిక్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లకు డబ్బు చెల్లించలేదని అన్నారు. మోదీ జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకున్నారు.

Updated Date - 2020-07-13T13:45:22+05:30 IST