అబార్షన్‌కు అనుమతి కోసం హైకోర్టు‌కు ఓ యువతి.. ఆమె చెప్పిన నిజాలు విని నివ్వెరపోయిన న్యాయమూర్తి.. చివరకు..

ABN , First Publish Date - 2022-05-24T21:47:00+05:30 IST

మాతృత్వం అనేది మహిళకు ఓ వరం. అమ్మ అనే పిలుపు కోసం మహిళలకు ఆరాటపడుతుంటారు. పిల్లల భవిష్యత్ కోసం తమ జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా వెనుకాడరు. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ మాత్రం అబార్షన్ కోసం..

అబార్షన్‌కు అనుమతి కోసం హైకోర్టు‌కు ఓ యువతి.. ఆమె చెప్పిన నిజాలు విని నివ్వెరపోయిన న్యాయమూర్తి.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

మాతృత్వం అనేది మహిళకు ఓ వరం. అమ్మ అనే పిలుపు కోసం మహిళలకు ఆరాటపడుతుంటారు. పిల్లల భవిష్యత్ కోసం తమ జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా వెనుకాడరు. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ మాత్రం అబార్షన్ కోసం తనకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఆమె చెప్పిన నిజాలు విని న్యాయమూర్తి సైతం నివ్వెరపోయారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బాధితురాలి కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జలౌన్‌ పరిధికి చెందిన యువతికి మలన్‌పూర్‌ పరిధికి చెందిన యువకుడితో 2021 జూన్‌లో వివాహమైంది. ఈ దంపతులు తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి సంసారంలో మొన్నటి వరకు ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల మహిళపై ఆమె మామ కన్నేశాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ రోజు కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని నెలల తర్వాత ఆమె గర్భం దాల్చింది. తన మామ చేసిన నిర్వాకంపై భర్త, కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

కూతురు ఎదుటే తండ్రి చేసిన నిర్వాకం.. జరిగిన ఘటన గురించి బాలిక చెప్పింది విని అంతా షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..


తర్వాత తనకు అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. అయితే బాధితురాలు గర్భం దాల్చడానికి ఆమె మామ కారణం కాదని తెలిస్తే.. ఫిర్యాదుదారుపై చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. ఈ కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇంటికి రండి పెళ్లి చేస్తామన్న యువతి తల్లిదండ్రులు.. అయితే సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన కూతురు.. ఏమంటోందంటే..

Updated Date - 2022-05-24T21:47:00+05:30 IST