Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 28 Apr 2022 10:50:11 IST

మేనమామ ఇంటికి వెళ్లిన మేనల్లుడు... సరదాగా మేడపైకి వెళ్లి ఫోన్‌లో మాట్లాడుతుండగా..

twitter-iconwatsapp-iconfb-icon

అనూహ్యంగా చోటు చేసుకునే కొన్ని ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని ఘటనలు విషాదాన్ని నింపుతుంటాయి. అంతవరకు కళ్ల ఎదుట సంతోషంగా గడిపిన వారు.. దురదృష్టవశాత్తు  అంతలోనే మృత్యు ఒడిలోకి జారుకొంటుంటారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఇలాంటి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మేనమామ గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లిన మేనల్లుడు.. సరదాగా మేడపైకి వెళ్లా్డు. అంతలోనే ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అదే సమయంలో చోటు చేసుకున్న అనూహ్య ఘటన.. అందరినీ శోకసంద్రంలో ముంచేసింది... ఏం జరిగిందంటే..

జార్ఖండ్ రాష్ట్రం పాలము జిల్లా మేదినీనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సత్సంగ్ భవన్ రోడ్డులో నివాసం ఉంటున్న అనిల్ దూబే  అనే వ్యక్తి ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం పూర్తి చేశాడు. గృహ ప్రవేశ కార్యక్రమం ఉండడంతో బంధువులందరనీ ఆహ్వానించాడు. అనిల్ దూబే మేనల్లుడైన.. పహాడ్ గ్రామానికి చెందిన నందన్ తివారీ(24) కూడా కార్యక్రమానికి హాజరయ్యాడు. బుధవారం రాత్రి బంధువులందరితో సంతోషంగా గడిపాడు. కొత్త ఇల్లు మొత్తం చూసే క్రమంలో మేడపైకి వెళ్లాడు. అదే సమయంలో ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉన్నాడు.

వెళ్లి వేడుకలో వరుడి ప్రవర్తన చూసి వధువు తండ్రి షాకింగ్ నిర్ణయం.. అదే ముహూర్తానికి కూతురికి వేరే వ్యక్తితో..

రాత్రి కావడంతో మేడపైన ఏమీ కనిపించలేదు. అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుండగా.. అనుకోని ప్రమాదం జరిగింది.  అనిల్ దూబే ఇంటిపై చేతికందే ఎత్తులో హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. నందన్ తివారీకి ఈ ప్రాంతానికి కొత్త కావడంతో చూసుకోలేదు. ఫోన్ మాట్లాడే క్రమంలో వైర్లు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన బంధువులు, స్థానికులు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే యువకుడి మృతదేహం కాలిపోతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తన సోషల్ మీడియా అకౌంట్‌లో అసభ్యకర వీడియోలను చూసి ఖంగుతిన్న టీచర్.. దీనిపై ఆరాతీయగా చివరకు ఏం తెలిసిందంటే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఇకపై మీ ఇంటి పేరు విషయంలో ఈ నిబంధనలు పాటించాల్సిందే.. కోర్టు ఏమంటోందంటే..Viral Video: ఫొటోను చూసే అవాక్కవుతున్నారా..? ఈ King Cobra వీడియోను చూస్తే..videoViral Video: భర్తతో బైక్‌పై వెళ్తుండగా సడన్‌గా కిందపడిన తల్లీకొడుకు.. ఎదురుగా దూసుకొస్తున్న కంటైనర్.. ఒక్క క్షణంలో..videoViral video: ఈ బుడ్డోడు చాలా ఫాస్ట్.. పెళ్లిలోని సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఎలాంటి ఫీట్స్ చేస్తున్నాడో చూడండి..videoనేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేసిన యువకుడు... కొన్ని రోజులకు హత్యకు గురైన ప్రియురాలు, తల్లిదండ్రులు.. అసలు ఏం జరిగిందంటే..మా వదిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ పక్కింటోళ్లకు కాల్ చేసి చెప్పాడా వ్యక్తి.. వాళ్లు వెళ్లి చూస్తే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.