Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుంటా అని ఎంత చెప్పినా వినని కుటుంబ సభ్యులు.. 10రోజుల్లో పెళ్లనగా అతడు చేసిన పనికి ఊరంతా షాక్..

ఇంటర్నెట్ డెస్క్: కుమారుడికి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేయాలని భావించారు. అదే విషయాన్ని అతడి వద్ద ప్రస్తావించారు. అయితే.. తల్లిదండ్రుల అభిప్రాయాన్ని అతడు వ్యతిరేకించాడు. ‘ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుంటా’ అని తేల్చి చెప్పాడు. కానీ అతడి మాటలను తల్లిదండ్రులు లెక్కచేయలేదు. అమ్మాయిని చూసి, పెళ్లి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. ఈ క్రమంలో 10 రోజుల్లో పెళ్లనగా అతడు చేసిన పనికి ఊరిలోని ప్రజలంతా షాకయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని భిల్వారా ప్రాంతానికి చెందిన అంబాలాల్ మాలీకి ప్రస్తుతం 22ఏళ్లు. ఈ క్రమంలో అతడి వద్ద తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అయితే అంబాలాల్ మాలీ మాత్రం.. ఇప్పుడే పెళ్లి వద్దంటూ వారితో వాదించాడు. బిజినెస్ చేసి.. నాలుగు డబ్బులు వెనకేసినత తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. కానీ అతడి అభిప్రాయాన్ని వాళ్లు.. లెక్కచేయలేదు. పెళ్లైన తర్వాత కూడా డబ్బులు సంబంధించొచ్చు అని సర్దిచెప్పుకుంటూ.. సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ అమ్మాయిని చూసి, పెళ్లి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు.


అయితే పెళ్లి విషయంలో బుధవారం రోజు మరోసారి తన తల్లిదండ్రులతో అంబాలాల్ వాదనకు దిగాడు. దీంతో ఇంట్లో చిన్న గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో అంబాలాల్ ఇంటి నుంచి బయటికొచ్చేశాడు. ఆ తర్వాత వీధిలో ఉన్న ఓ కరెంట్ స్తంభానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విగత జీవిగా స్తంభానికి వేలాడుతున్న అంబాలాల్‌ను చూసి గ్రామస్థులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement