చెరువులో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-10-04T04:06:40+05:30 IST

సద్దుల బతుకమ్మ పండుగ పూట విషాదం నెలకొంది. బతు కమ్మను పేర్చేందుకు కలువ పూల కోసం సోమవారం ఉద యం చెరువులోకి దిగిన యువ కుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. రేండ్లగూడ గ్రామానికి చెందిన ఆకుల వివేక్‌ అలియాస్‌ నందు (19) గ్రామ శివారులో పూల సేకరణకు వెళ్ళాడు.

చెరువులో పడి యువకుడి మృతి
ఆకుల వివేక్‌ అలియాస్‌ నందు (ఫైల్‌)

 కలువ పూలకు వెళ్ళి కానరాని లోకాలకు

జన్నారం, అక్టోబరు 3: సద్దుల బతుకమ్మ పండుగ పూట విషాదం నెలకొంది. బతు కమ్మను పేర్చేందుకు కలువ పూల కోసం సోమవారం ఉద యం చెరువులోకి దిగిన యువ కుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. రేండ్లగూడ గ్రామానికి చెందిన ఆకుల వివేక్‌ అలియాస్‌ నందు (19) గ్రామ శివారులో పూల సేకరణకు వెళ్ళాడు.  కలువ పూల కోసం ధర్మారం చెరువు లోకి దిగగా చెరువు లోపల ఉన్న నాచు, గడ్డి కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్ధానికులు కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. తల్లి అమృత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు. మృతుడి తండ్రి సతీష్‌ ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్ళాడు. సతీష్‌కు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు వివేక్‌ మృతి చెందాడు. పండుగ రోజు పూల కోసం వెళ్లి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

 

Updated Date - 2022-10-04T04:06:40+05:30 IST