అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తికి వెరైటీ ట్రిక్‌తో బుద్ధి చెప్పిన యువతి.. దెబ్బకు హడలిపోయిన నెటిజన్..

ABN , First Publish Date - 2021-09-10T17:57:36+05:30 IST

అమ్మాయిల ఫోన్ నెంబర్లకు, వారి సోషల్ మీడియా ఖాతాలకు కొందరకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతుంటారు..

అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తికి వెరైటీ ట్రిక్‌తో బుద్ధి చెప్పిన యువతి.. దెబ్బకు హడలిపోయిన నెటిజన్..

అమ్మాయిల ఫోన్ నెంబర్లకు, వారి సోషల్ మీడియా ఖాతాలకు కొందరకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతుంటారు.. చాలా మంది అమ్మాయిలు అలాంటి వాటికి స్పందించరు.. ఒక యువతి మాత్రం తనకు అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తికి వెరైటీ ట్రిక్‌తో బుద్ధి చెప్పింది.. దీంతో సదరు వ్యక్తి హడలిపోయాడు. ఆ మెసేజ్‌లను సదరు యువతి ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 


చంతయ్ జోసెఫ్ అనే యువతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడు అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు పంపుతున్నాడు. దీంతో అతడికి బుద్ధి చెప్పాలని జోసెఫ్ డిసైడ్ అయింది. అతడి ఖాతాకు ఆటోమేటెడ్ మెసేజ్‌లు పంపించింది. `మీ ఖాతా నుంచి అసభ్యకర మెసేజ్‌లు, పోర్నోగ్రఫీ వీడియోలు వస్తున్నట్టు గుర్తించాం. మీ డివైజ్ ఐపీ అడ్రస్‌ను పోలీసులకు పంపించాం. పొరపాటు జరిగింది అని మీరు భావిస్తే.. `స్టాప్` అని రిప్లై ఇవ్వండి` అంటూ సదరు వ్యక్తికి మెసేజ్ పంపింది. 


ఇవి కూడా చదవండి

పెళ్లికి ఒప్పుకోవడం లేదని ప్రియుడిపై అత్యాచారం కేసు పెట్టిన యువతి.. విచారణలో నిజం బయటపడటంతో.





పెళ్లికి ముందే కాబోయే భర్తతో శారీరకంగా కలిసిన యువతి.. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే మృతి.. అసలేం జరిగిందంటే..


ఆ మెసేజ్‌ను నిజమని నమ్మిన సదరు నెటిజన్ వెంటనే `స్టాప్` అని మెసేజ్ పంపాడు. అలాగే `మీ అడ్రస్, ఇతర వివరాలు పోలీసులకు ఫార్వార్డ్ చేశాము. కొద్ది సేపట్లోనే వారు మీతో మాట్లాడతారు. మీ తరఫున పొరపాటు జరిగినట్టే మీరు భావిస్తే.. `హెల్ప్` అని రిప్లై ఇవ్వండి` అని జోసెఫ్ మరో మెసేజ్‌ను అతడికి పంపింది. భయపడిపోయిన అతడు `హెల్ప్` అని రిప్లై ఇచ్చాడు. అనంతరం జోసెఫ్ అతడి ఖాతాను బ్లాక్ చేసింది. అలాగే ఆ సంభాషణల స్క్రీన్ షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Updated Date - 2021-09-10T17:57:36+05:30 IST