రెండేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-01-28T06:07:40+05:30 IST

జిల్లా కేంద్రం భువనగిరి మునిసిపాలిటీ రెండేళ్ల పాలనపై పాలకపక్షమైన టీఆర్‌ఎస్‌ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు.

రెండేళ్ల  పాలనపై  శ్వేతపత్రం విడుదల చేయాలి
కరపత్రం విడుదల చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

 భువనగిరి టౌన, జనవరి 27: జిల్లా కేంద్రం భువనగిరి మునిసిపాలిటీ రెండేళ్ల పాలనపై పాలకపక్షమైన టీఆర్‌ఎస్‌ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కాంగ్రెస్‌  కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. కౌన్సిల్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన బర్రె జహాంగీర్‌ మాట్లాడుతూ తాము లేవనెత్తుతున్న 20 అంశాలపై పట్టణ ప్రజలకు పాలక పక్షం వివరణ ఇవ్వాలన్నారు. రెండేళ్ల కౌన్సిల్‌ సమావేశాల్లో చేసిన తీర్మానాల అమలు, పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే కేటాయించిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, పెద్ద చెరువు కట్టపై మినీ ట్యాంక్‌ బండ్‌ అభివృద్ధి, కాంట్రాక్ట్‌ కార్మికులకు బీమా చెల్లింపు, విలీన గ్రామాల అభివృద్ధి, రోడ్డు వెడల్పుతో నిర్వాసితులైన 208 మంది చిరువ్యాపారుల భవిష్యత్తు, పట్టణ ప్రగతి నిధుల వినియోగం తదితర అంశాలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో ప్రజాందోళన చేపడుతామని 20 అంశాలతో కూడిన జాబితాను విడుదల చేశారు.  సమావేశంలో  కాంగ్రెస్‌ కౌన్సిలర్లు పడిగెల రేణుకా ప్రదీప్‌, ఈరపాక నర్సింహ, కైరంకొండ వెంకటేశ, వడిశర్ల కృష్ణాయాదవ్‌, నజీమా సల్లాఉద్దీన, కోళ్ల దుర్గా భవానీ గంగాధర్‌, నాయకులు కె మహేందర్‌, గర్గాయి దేవేందర్‌, డాకూరి ప్రకాశ, కసరబోయిన సాయి, అందె నరేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T06:07:40+05:30 IST